ఒకప్పుడు టీవీలో యాంకర్ అంటే ఒక్క పేరు— ఉదయభాను . ఏ షో అయినా, ఏ స్టేజ్ ఈవెంట్ అయినా, ఒక్కరే హైలైట్. బుల్లితెర క్వీన్ లా దూసుకెళ్లిన ఆమె ఇప్పుడు మళ్లీ హెడ్లైన్స్ లోకి వచ్చేశారు. ఈసారి మాత్రం ఎంటర్టైన్మెంట్ వల్ల కాదు— రియాలిటీ షోల బీహైండ్ ది సీన్ సీక్రెట్స్ బహిర్గతం చేసి షాక్ ఇచ్చేశారు.

ఓ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉదయభాను చెప్పిందేంటంటే—

“ఇప్పటి రియాలిటీ షోలంటే అంతా ప్యూర్ స్క్రిప్ట్‌. చెవిలో ఇయర్ ఫోన్స్ పెడతారు. అక్కడి నుండి ‘ఆవిడ్ని తిట్టండి… ఇక్కడ నవ్వండి… ఇప్పుడు సెంటిమెంట్ లోకి వెళ్ళండి’ అని డైరెక్ట్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుంటారు. మనకి చేయడానికి ఏం ఉండదు. అన్నీ ప్రీ-ప్లాన్డ్. రియాలిటీ అని చూపిస్తారు కానీ రియల్ ఏమీ ఉండదు. నేను ఇలాంటి షోలు చాలాకాలం క్రితమే వదిలేశాను. మళ్లీ రెండు షోలు చేసాను కానీ, ఎందుకు చేశానా అని తర్వాత పశ్చాత్తాపం పడ్డాను” అని ఓపెన్‌గా ఫైర్ చేసేశారు.

స్క్రీన్ మీద కనిపించే ఫైట్స్, డ్రామా, కన్నీళ్లు—all scripted అని ఉదయభాను చెప్పేసిన తర్వాత, టీవీ రియాలిటీ షోల మీద ఆడియన్స్ నమ్మకం మళ్లీ ప్రశ్నార్థకం అయిపోయింది.

అయితే, గుడ్ న్యూస్ ఏంటంటే— ఉదయభాను ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. చాలా కాలం తర్వాత ‘బార్బరిక్‌’ అనే సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆ మూవీ ఆగస్టు 22న థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది.

,
You may also like
Latest Posts from