
భారత సినీ ప్రేక్షకులు మళ్లీ ఒక విజువల్ ఫీస్ట్‌కి సిద్ధమవుతున్నారు. బాహుబలి సిరీస్ రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా తెరపైకి తీసుకువస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇక తాజాగా నిర్మాత శోభు యారలగడ్డ ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు — ‘బాహుబలి: ది ఎపిక్’ ఫైనల్ రన్‌టైమ్ 3 గంటల 40 నిమిషాలుగా లాక్ అయ్యిందట!
ఇక బాహుబలి: ది బిగినింగ్ నుండి బాహుబలి: ది కన్క్లూజన్ వరకూ అమరేంద్ర – మహేంద్ర బాహుబలి సాగాను ఒకే సారి ప్రేక్షకులు అనుభవించబోతున్నారు. రెండు భాగాల కథను ఒకే సినిమాగా విలీనం చేస్తూ — డ్రామా, యాక్షన్, భావోద్వేగాలు అన్నీ మరింత మేజిక్‌గా అనిపించేలా ఈ కొత్త కట్ రూపొందించారట.
ఇక అభిమానుల్లో ఉత్సాహం తారస్థాయిలో ఉంది. రాజమౌళి సృష్టించిన బాహుబలి యూనివర్స్‌ను మళ్లీ పెద్ద తెరపై చూడడానికి ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
3 గంటల 40 నిమిషాల ఎపిక్ అనుభవం — బాహుబలి గాథ మళ్లీ మొదలుకాబోతోంది!
స్పెషల్ ఎడిషన్ ‘బాహుబలి: ది ఎపిక్’ ఈ నెల అక్టోబర్ 31న థియేటర్లలోకి రానుంది. తాజా టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకోగా,సినిమా రన్‌టైమ్, కొత్త సీన్స్, ప్రమోషన్స్‌పై ఆసక్తి నెలకొంది. ఈ స్పెషల్ ఎడిషన్ క్లైమాక్స్‌లో ‘బాహుబలి 3’ కు సంబంధించి ఏదైనా హింట్ ఉంటుందా అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ విషయంపై నిర్మాత శోభు యార్లగడ్డ స్పందిస్తూ, “ఇది పూర్తిగా రూమరే… బాహుబలి 3పై ఇంకా చాలా పని మిగిలి ఉంది. కానీ ‘బాహుబలి: ది ఎపిక్’లో చిన్న సర్ప్రైజ్ మాత్రం ఉండొచ్చు అని చెప్పి సినిమాపై మరింత ఉత్కంఠను పెంచారు.
రీ-రిలీజ్ ద్వారా ఎంత కలెక్షన్స్ ఆశిస్తున్నారు?’ అనే ప్రశ్నకు శోభు స్పందిస్తూ, “ఇది కలెక్షన్ల కోసమే కాదు. ఇది ఓ సెలబ్రేషన్. బాహుబలి విడుదలై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంలో ప్రేక్షకులకు ఓ గ్రాండ్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ప్లాన్ చేశాం.” అని తెలిపారు.
