
ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో విలన్ గా బాలీవుడ్ హీరో! ఎవరంటే..!
ఎన్‌టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న పాన్-ఇండియా యాక్షన్ అడ్వెంచర్ ‘డ్రాగన్’ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో షూట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం… ఈ మ్యాగ్నమ్ ఆపస్‌లోకి బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశాడట!
ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ‘డ్రాగన్’లో అనిల్ కపూర్ ఫిల్మ్ మెయిన్ యాంటగనిస్ట్. వచ్చే షెడ్యూల్ నుంచే ఆయన సెట్స్‌పై జాయిన్ కాబోతున్నారట. ఈ గుడ్ న్యూస్‌పై మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు.
డిసెంబర్ నుంచి ‘డ్రాగన్’ టీమ్ నాన్-స్టాప్ షూట్ చేయాలని ప్లాన్ చేసుకుంది. మొత్తం నెల ఫుల్ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్‌లు, కీలక సీన్లు జరగనున్నాయట. నీల్ మార్క్ యాక్షన్ బ్లాక్స్ కోసం స్పెషల్ సెట్స్ తయారవుతున్నాయట అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
కానీ… రిలీజ్ డేట్ పెద్ద ట్విస్ట్!
అసలు రిలీజ్ కోసం అనౌన్స్ చేసిన జూన్ డేట్ ఇక కచ్చితంగా మిస్ అవుతున్నట్టే. షూట్ పుష్ అవ్వడంతో డేట్ మారింది. కొత్త రిలీజ్ డేట్ వచ్చే ఏడాదిలో ప్రకటించబోతున్నారట.
ఎన్‌టీఆర్ లుక్ టాక్ ఆఫ్ ది టౌన్!
‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్ తీసుకున్న లీన్ & రగ్గడ్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో బోల్డ్‌గా ట్రెండ్ అవుతోంది. అలాగే సినిమా మొత్తం ఆ తర్వాత ఏమౌతుందో? అన్నట్టుగా ఇంటెన్స్ తో మాస్, యాక్షన్ అన్నీ ఓవర్‌డోస్‌గా ఉండబోతున్నాయట.
హీరోయిన్‌గా రుక్మిణి వసంత్
కాంతార ఫేమ్ రుక్మిణి వసంత్ ఈ భారీ ప్రాజెక్ట్‌లో లీడింగ్ లేడీ. ఆమె పాత్ర కూడా చాలా స్ట్రాంగ్‌గా డిజైన్ చేశారట.
