“Kingdom” ఊహించని విధంగా అనుకున్న తేదీ కంటే ముందుగానే చాలా త్వరగా డిజిటల్‌లోకి ఎంట్రి ఇస్తోందని Netflix అధికారికంగా అనౌన్స్ చేసి షాక్ ఇచ్చింది. సాధారణంగా సినిమాలు కనీసం నెలరోజులైనా థియేటర్స్‌లో ఆడతాయి. కానీ కొత్త ట్రెండ్ ప్రకారం ఈసారి కేవలం 27 రోజుల్లోనే ఆగస్టు 27 నుంచి Netflixలో స్ట్రీమింగ్ మొదలు అని చెప్పేసింది!
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘కింగ్డమ్’ (Kingdom) సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 27 నుంచి ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix)లో స్ట్రీమింగ్ కానుంది. సదరు సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది (Kingdom OTT Streaming Date).ఈ సినిమా జులై 31న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయ్‌కు అన్నయ్యగా సత్యదేవ్ ఆకట్టుకున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో “Kingdom” టైటిల్ తో రానుండగా, హిందీలో మాత్రం టైటిల్ మార్చి “Samrajya” గా రిలీజ్ చేస్తున్నారు.
సినిమా మేజర్‌గా శ్రీలంక బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో, మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసినా… మ్యూజిక్ స్ట్రాంగ్ కాకపోవడం, అలాగే విజయ్–భాగ్యశ్రీ బోర్స్ లవ్ ట్రాక్ ఫ్లాట్‌గా ఉండడం వల్ల యువ ఆడియన్స్‌ని బాగా కనెక్ట్ చేయలేకపోయింది.
అయినా నిర్మాత నాగ వంశీ ఓ సేఫ్ గేమ్ ఆడేశారు. Netflix డిజిటల్ రైట్స్ కోసం భారీ మొత్తం ఇచ్చిందని టాక్!
మరి థియేటర్స్‌లో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, OTTలో రెండో ఇన్నింగ్స్ కొడుతుందా? లేక మరీ ఫ్లాప్ అనిపించుకుంటుందా? అన్నది చూడాల్సిందే.