
సి.కళ్యాణ్ ‘ఎన్‌కౌంటర్’ డిమాండ్‌తో టాలీవుడ్ షాక్
iBomma వ్యవస్థాపకుడు ఇమ్మడి రవి అరెస్ట్‌తో టాలీవుడ్‌లో అలజడి ఇంకా తగ్గకముందే… నిర్మాత సి.కళ్యాణ్ చేసిన ఎన్‌కౌంటర్ వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారితీశాయి.
భారత చట్టం చెప్పేదే స్పష్టం — ఎంత పెద్ద నేరం చేసినా శిక్షించేది కోర్టే. ఎవరినైనా ఎన్‌కౌంటర్ చేయడం చట్ట విరుద్ధమే.
కానీ సి.కళ్యాణ్ మాత్రం పబ్లిక్‌గా “పోలీసులు ఎన్‌కౌంటర్ చేయకపోతే… ఇండస్ట్రీ చేసేయాలి!” అని చెప్పడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు.
ఇప్పటికే ఇమ్మడి రవి కేసులో బయటపడుతున్న వివరాలు శాక్‌కు గురి చేస్తున్నాయి:
– విదేశాల నుంచి నడిపిన పైరసీ ర్యాకెట్
– కరీబియన్ దీవుల్లో ఉన్న సర్వర్లు
– మొదటి ఫోరెన్సిక్ దశలోనే బయటపడిన 21,000 పైరేటెడ్ సినిమాలు
పైరసీ పెద్ద నేరమే… కానీ ఎన్‌కౌంటర్‌కి పిలుపునివ్వడం సరైంది కాదని లీగల్ నిపుణులు, నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. “చట్టం ఉన్నప్పుడు చట్టమే మాట్లాడాలి… ఇలా పబ్లిక్‌గా ఎన్‌కౌంటర్ కోరడం తప్పు” అని అంటున్నారు.
ఇంతకీ—
సి.కళ్యాణ్ మాటలు నిజమైన ఆవేశమా? లేక ఓవర్ రియాక్షనా?
సోషల్ మీడియాలో మాత్రం ఇదే చర్చ!
