‘ఆర్ఆర్ఆర్’ లాంటి చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రామ్ చరణ్ యాడ్స్ రంగంలోనూ తనదైన శైలితో దూసుకుపోతున్నారు. సినిమాలతో పాటు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌లో కూడా ఆయన రాణిస్తున్నారు. కాంపా లాంటి బ్రాండ్‌తో జతకట్టడం ద్వారా, రామ్ చరణ్ తన వాణిజ్య ప్రభావాన్ని మరింత విస్తరిస్తున్నారు. రామ్ చరణ్ కాంపా బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రిలయన్స్ కు చెందిన ప్రముఖ శీతల పానీయాల బ్రాండ్ కాంపా డ్రింక్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితుడయ్యాడు. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. 2023 మార్చిలో మార్కెట్లో రంగప్రవేశం చేసిన కాంపా వేగంగా ఎదుగుతోంది.

రామ్ చరణ్ తో కాంపా ప్రత్యేక యాడ్ ను కూడా రూపొందించారు. ‘కాంపా వాలీ జిద్ద్’ పేరిట ఈ యాడ్ ను ప్రచారంలోకి తీసుకువచ్చారు. ఈ యాడ్ ను ఐపీఎల్ లోనూ, ఇతర వేదికలపైనా, టీవీల్లో, మొబైల్ వేదికలపైనా ప్రసారం చేయనున్నారు.

సినిమా రంగంలో రామ్ చరణ్ ఇప్పటికే తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ‘గేమ్ ఛేంజర్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఆయన, ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు.

,
You may also like
Latest Posts from