టాలీవుడ్‌లో ఓ సమయంలో శ్రీలీల ఓ రేంజిలో దూసుకెళ్లింది. కానీ ఆ స్పీడు ఈ మధ్యన తగ్గింది. వరుస డిజాస్టర్స్‌తో కెరీర్ గేర్ స్లో అయిపోయింది. స్కంద, ఆదికేశవ, గుంటూరు కారం, ఎక్స్ ట్రాడినరి మ్యాన్, రాబిన్ హుడ్, జూనియర్.. ఇలా ఈ చిన్నది అడుగుపెట్టిన ప్రతి సినిమా ప్లాప్ బాట పట్టింది. మధ్యలో భగవంత్ కేసరి హిట్ అయినా అది బాలయ్య ఖాతాలోకి పోతుంది. ఇక పుష్ప 2 లో కిస్సిక్ సాంగ్ తో డ్యాన్సర్ గా మంచి హిట్ అందుకుంది.
తాజాగా వచ్చిన ‘మాస్ జాతర’ కూడా అదే దారిలో వెళ్లిపోవడంతో, శ్రీలీల కెరీర్ డైలమోలో పడింది. ఈ క్రమంలో ఆ ప్లాఫ్ ల నుంచి బయిటపడే మార్గం కోసం చూస్తోంది. తనను ఎలాగైనా ఫ్లాప్ స్ట్రీక్ నుంచి బయటపడేసే స్ట్రాంగ్ రోల్స్ కోసం శ్రీలీల హంట్ మొదలుపెట్టింది.
ఇదే సమయంలో ఆమె చేతికి వచ్చిన ఓ కీలక చాన్స్ — ‘పరాశక్తి’.
▪️ తమిళ డెబ్యూ
▪️ సుధా కొంగర డైరెక్షన్
▪️ శివకార్తికేయన్ హీరో
▪️ పీరియడ్ బ్యాక్‌డ్రాప్
▪️ పర్ఫార్మెన్స్‌కు పెద్ద స్పేస్ ఉన్న రోల్ అన్న టాక్
‘గురు’, ‘ఆకాశం నీ హద్దురా’ లాంటి సినిమాల్లో హీరోయిన్స్ కు స్ట్రాంగ్ క్యారెక్టర్స్ తీర్చిదిద్దిన సుధా కొంగర, ఈసారి కూడా హీరోయిన్ రోల్‌కు మంచి డెప్త్ ఇచ్చిందని ఇండస్ట్రీలో మాట. ఇప్పటివరకు పాటలు, రొమాన్స్ కి పరిమితమైన శ్రీలీల ఇందులో మంచి పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
టాక్ ఏంటంటే —
పరాశక్తి హిట్ అయితే శ్రీలీల కెరీర్ ట్రాక్ మారిపోతుంది. గ్లామ్ ఇమేజ్‌ని బ్రేక్ చేసి, యాక్టర్‌గా సెట్ అయ్యే అవకాశం.ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలనే క్రియేట్ చేశాయి. ఈ సినిమా కూడా పరాజయం అందుకుంది అంటే ఇక శ్రీలీల కెరీర్ అగమ్యగోచరం.

