మలయాళ నటీమణి శ్వేతా మీనన్‌పై సంచలనంగా కేసు నమోదైంది. ఎర్నాకులం సెంట్రల్ పోలీస్‌స్టేషన్‌లో ఆమెపై అశ్లీల చిత్రాలు, ప్రకటనలలో నటించి ఆర్థిక లాభం పొందారనే ఆరోపణలతో కేసు నమోదైంది.

ఈ విషయాన్ని పౌర హక్కుల కార్యకర్త మార్టిన్ మెనాచేరి కోర్టులో లేవనెత్తగా, ఎర్నాకులం CJM కోర్టు స్పందించి పోలీసులకు విచారణ చేపట్టాలని ఆదేశించింది. దీంతో శ్వేతపై అధికారికంగా లీగల్ ప్రాసెసు ప్రారంభమైంది.

తన ఆర్థిక లాభం కోసం అడల్ట్ చిత్రాల్లో నటిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తోందని మార్టిన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో ఆమె మీడియాలో ఇచ్చిన ఇంటర్వ్యూ వల్లే ఫిర్యాదు చేయడానికి కారణమన్నారు. డబ్బు కోసం తాను ఇలాంటి సినిమాలు చేయడానికి సిద్ధమేనని ఆమె చెప్పారని మార్టిన్ ఆరోపించారు.

అడల్ట్ సినిమాల ద్వారా డబ్బులు సంపాదించడం ఐటీ చట్టం ప్రకారం తప్పు అని ఆయన పోలీసులను ఆశ్రయించారు. అయితే మొదట పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి శ్వేత మీనన్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

ప్రస్తుతం ఈ ఆరోపణలపై శ్వేతా మీనన్ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. కానీ సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై ఆమె ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి!

శ్వేతా మీనన్.. 1991లో మలయాళ చిత్రం అనస్వరంతో తన నటనను ప్రారంభించింది. ఆ తర్వాత మలయాళ చిత్రాలతో పాటు పలు బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లోనూ కనిపించింది.

టాలీవుడ్‌లో నాగార్జున నటించిన రాజన్న చిత్రంలో కనిపించింది.

బాలీవుడ్‌లో అశోక, బంధన్, హంగామా, రన్, కార్పొరేట్, శాండ్‌విచ్, కిస్సే ప్యార్ కరూన్ లాంటి సినిమాల్లో నటించింది.

ఆమె చివరిగా 2024లో విడుదలైన మలయాళ చిత్రం జాంగర్, వెబ్ సిరీస్ నాగేంద్రన్స్ హనీమూన్స్‌లో మెప్పించింది.

ఇటీవలే ఎంకిలే ఎన్నోడు పారా అనే మలయాళ షోను కూడా శ్వేత హోస్ట్ చేసింది.

మలయాళంలో రతినిర్వేదం, పలేరి మాణిక్యం, కలిమన్ను వంటి చిత్రాలలో తన నటనతో ఆకట్టుకుంది. సినిమాలతో పాటు ఆమె పలు వాణిజ్య ప్రకటనలు చేసింది.

శ్వేతామీనన్ నటి, మోడల్, టెలివిజన్ యాంకర్ గాను చేసింది. ఆమె 1994లో ఫెమినా మిస్ ఇండియా ఆసియా పసిఫిక్ టైటిల్ విజేతగా నిలిచింది.

శ్వేత మీనన్ మలయాళం, హిందీ, తెలుగు, తమిళ భాషా సినిమాల్లో నటించి ఉత్తమ నటిగా రెండు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది.

ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించింది. అలాగే మలయాళం టీవీ షోల్లో కనిపించింది.

ఇక పలు సీరియల్స్ లోనూ నటిస్తూ బిజీగా ఉంది ఆమె. అలాగే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది శ్వేతామీనన్.