సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు డిఫరెంట్ స్టైల్ డైరెక్టర్స్‌గా గుర్తింపు పొందిన సందీప్ రెడ్డి వంగా – రామ్ గోపాల్ వర్మలు ఇప్పుడు ఒకే వేదికపై కనబడుతున్నారు. ఈ ఇద్దరి మధ్య ఉన్న స్నేహం, పరస్పర గౌరవం ఇండస్ట్రీలో ఎవరికీ కొత్తది కాదు. ఆ కలయిక ఇప్పుడు జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జీ5 టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ లో ప్రత్యేక ఆకర్షణగా మారబోతోంది.
ఇప్పటికే నాగార్జునతో మొదలైన ఈ షో, తర్వాత శ్రీలీల, నాని ఎపిసోడ్లతో మంచి వ్యూయర్‌షిప్ సాధించింది. ఇప్పుడు వంగా – ఆర్జీవీ ఎపిసోడ్‌కి ఆడియన్స్ ఎక్సైట్మెంట్ మరో లెవల్‌కి వెళ్లిపోయింది. బయటకు వచ్చిన ప్రోమోలో వీరి మధ్య జరిగే జోకులు, పంచులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ఆన్‌లైన్‌లో పెద్ద చర్చనీయాంశమవుతున్నాయి.
జీ5 తెలుగు ఒరిజినల్‌గా రూపొందుతున్న ఈ టాక్ షోలో, వంగా – ఆర్జీవీ ఎపిసోడ్ సెప్టెంబర్ 5న రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్ కాబోతోంది. టెలివిజన్ ఆడియన్స్ కోసం సెప్టెంబర్ 7న రాత్రి 9 గంటలకు జీ తెలుగు చానల్‌లో ప్రసారం అవుతుంది.
సినిమా మీద విభిన్న దృక్పథం ఉన్న ఈ ఇద్దరు డైరెక్టర్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతుండటంతో, షో క్రేజ్ మరింత పెరగడం ఖాయం.