తమిళ్‌లోనూ, తెలుగులోనూ స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ ఉన్న డైరెక్టర్ ఎవరో అంటే వెంటనే గుర్తొచ్చే పేరు – లోకేష్ కనగరాజ్ . ఖైది , మాస్టర్ , విక్రమ్ , లియో సినిమాలతో బ్లాక్‌బస్టర్స్ ఇచ్చి, టాలీవుడ్, కొలీవుడ్ రెండింట్లోను భారీ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ స్థాయికి రాకముందే, తెలుగులో కూడా లోకేష్ సినిమా అంటే హైప్ ఏ రేంజిలో ఉంటుందో తెలిసిందే.

కూలీ బాక్సాఫీస్ వద్ద ఎక్స్పెక్టేషన్స్ కు తగ్గట్టుగా నిలవకపోయినా, లోకేష్ కెరీర్ మీద ఏ మాత్రం ఇంపాక్ట్ పడలేదు. అసలు, ఫ్లాప్ కంటే ఆయన లైనప్ గురించే ఇండస్ట్రీలో రచ్చ, డిస్కషన్ ఎక్కువగా జరుగుతోంది!

అటు తమిళ్ – ఇటు తెలుగు మార్కెట్‌ని బాగా అర్థం చేసుకున్న లోకేష్, స్టార్ హీరోలతో వరుస ప్రాజెక్టులు పెట్టేసుకున్నాడు.

రజనీకాంత్ – కమల్ హాసన్ కాంబినేషన్‌లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్
కార్తి తో ఖైది 2
కమల్ హాసన్ తో విక్రమ్ 2
సూర్యతో రోలెక్స్
బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ తో సూపర్ హీరో మూవీ

పైగా షారుక్ ఖాన్, మహేష్ బాబు లతో కూడా టచ్‌లో ఉన్నాడన్న గాసిప్స్… టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ కూడా అడ్వాన్స్ ఇచ్చేసి వెయిట్ చేస్తోందట.

“ఫ్లాప్ వచ్చినా… లైనప్ చూసి ఇండస్ట్రీ మొత్తం షాక్ అవుతోంది. లోకేష్ కనగరాజ్ రేంజ్ మరో లెవల్ లోకి వెళ్తుందన్నమాట!”

, , , , , , , , , ,
You may also like
Latest Posts from