సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక్క పేరు హవా చేస్తోంది – లోకేష్ కనకరాజ్. వయసులో చిన్నవాడు, కానీ టాలెంట్‌లో మాత్రం ఇండస్ట్రీ దిగ్గజాలను వెనక్కు నెట్టి ముందుకు సాగుతున్నాడు. ‘ఖైది’, ‘మాస్టర్’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి సినిమాలతో ప్రేక్షకుల గుండెల్లో తనదైన స్థానం సంపాదించుకున్న లోకేష్ ఇప్పుడు ‘కూలీ’ తో మరోసారి సందడి చేయబోతున్నాడు. ఈ సినిమా కేవలం కథలతోనే కాదు, సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కాంబినేషన్‌తోనే సంచలనంగా మారింది.

ఇప్పుడు ‘కూలీ’ సినిమా శరవేగంగా షూటింగ్ దశ ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. ఈ సినిమాకు సూపర్ స్టార్ రజనీకాంత్ 150 కోట్ల పారితోషికం తీసుకుంటుండగా, లోకేష్ కనకరాజ్‌కు ఏకంగా 50 కోట్లు రెమ్యునరేషన్ గా చెల్లిస్తున్నారు. ఇది ఎంత పెద్ద రేటు అంటే, ఇప్పటి వరకూ కేవలం ఆరు సినిమాలు మాత్రమే చేసిన డైరెక్టర్‌కు ఇది అరుదైన ఘనత.

ఇటీవల మీడియాతో మాట్లాడిన లోకేష్, “కూలీ కోసం రెండేళ్లు పూర్తిగా డెడికేట్ చేశాను. రజనీ సార్ rough cut చూశారు. చాలా సంతృప్తిగా స్పందించారు. రిలీజ్ అయిన తర్వాత మూడురోజులపాటు నేను ఈ ప్రపంచం నుంచీ మాయమైపోతాను!” అంటూ తన నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.

ఇదిలా ఉంటే, లోకేష్ ప్రాజెక్టుల లైన్-అప్ చూస్తే ఇండస్ట్రీ ఏ స్థాయిలో అతనిపై విరిగిపడుతోందో అర్థమవుతుంది.

ఖైది 2

విక్రమ్ 2

రోలెక్స్

ఆమీర్ ఖాన్‌తో సూపర్ హీరో మూవీ

ఇవి అన్ని వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి.

లోకేష్ కనకరాజ్ మేకింగ్‌కి మాస్ మేనరిజమ్‌, ఇంటెన్స్ ఎమోషన్స్, స్టైలిష్ టేకింగ్ అన్నీ కలిసొస్తాయి. అందుకే ఆయన సినిమాలంటే అభిమానులకు పండుగే.

ఇప్పుడు ఆయన కూలీతో తీసిన గోల్డ్ స్టాండర్డ్ ఏంటో రిలీజ్ తర్వాత తెలుస్తుందిలే!

, , , , , , , ,
You may also like
Latest Posts from