ఈ ఏడాది ప్రేక్షకులు ఎక్కువగా సినిమా అభిమానులు ఎదురుచూస్తున్న పాన్-ఇండియా సినిమాల్లో ‘కూలీ’ నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ఆగస్టు 14, 2025న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా క్రేజ్, పీక్స్ కు చేరింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాల్లో టికెట్ బుకింగ్స్ రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు, స్పెషల్ స్క్రీనింగ్స్ ప్లాన్ చేస్తున్నారు. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ‘కూలీ’ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద రూ. 150-180 కోట్ల వరకూ వసూలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

నటీనటుల పారితోషికాలు – ఇండస్ట్రీ టాక్

రజనీకాంత్ – ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో ఒకరైన రజనీ, ఈ చిత్రానికి రూ. 150 కోట్ల నుంచి రూ. 250 కోట్ల మధ్య పారితోషికం తీసుకున్నారని టాక్.

నాగార్జున – విలన్ పాత్రలో కనిపించే నాగార్జున, రూ. 25 కోట్ల నుంచి రూ. 30 కోట్ల మధ్య రేమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం.

ఆమీర్ ఖాన్ – గెస్ట్ అప్పియరెన్స్‌లో కనిపించనున్న ఆమీర్ ఖాన్, రజనీకి గౌరవ సూచకంగా ఎలాంటి పారితోషికం తీసుకోలేదట.

శృతి హాసన్ – సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ఆమెకు రూ. 4 కోట్ల పారితోషికం అందిందని చెబుతున్నారు.

పూజా హెగ్డే – ‘మోనికా’ అనే స్పెషల్ సాంగ్ కోసం పూజా హెగ్డేకు రూ. 4 కోట్లు చెల్లించారట. ఈ పాట ఇప్పటికే మ్యూజిక్ లవర్స్‌కి నచ్చింది.

సత్యరాజ్ – కీలక పాత్రలో నటిస్తున్న సత్యరాజ్‌కు రూ. 5 కోట్ల పారితోషికం ఇచ్చారని టాక్.

ఉపేంద్ర – ముఖ్యమైన రోల్‌లో నటిస్తున్న ఉపేంద్రకు రూ. 4 కోట్ల రేమ్యూనరేషన్ అందిందని చెబుతున్నారు.

లోకేష్ కనగరాజ్ – ఈ సినిమాకు దర్శకత్వం వహించిన లోకేష్ కనగరాజ్‌కు రూ. 50 కోట్లు పారితోషికం లభించిందని, ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారట.

ఈ పారితోషికాలు అధికారికంగా ప్రొడక్షన్ హౌస్ లేదా నటుల ద్వారా ధృవీకరించబడలేదు. అయితే, ఇండస్ట్రీలో వినిపిస్తున్న లెక్కలు ,స్పెక్యులేషన్స్  ఇవే.

, , , , , , , ,
You may also like
Latest Posts from