సినిమా వార్తలు

‘ధురంధర్ 2’ బిజినెస్ ట్విస్ట్.. టాలీవుడ్ బయ్యర్లకు షాక్!

బాక్సాఫీస్ దగ్గర మరో బిగ్గెస్ట్ వార్ మొదలైంది. ఈ నెల 19న థియేటర్లను ఊపేయడానికి సిద్ధమవుతున్న ‘ధురంధర్ 2’ సినిమా చుట్టూ ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద గందరగోళం నడుస్తోంది. ఈ సినిమా కోసం యూత్ ఎంతలా వెయిట్ చేస్తున్నారో మాటల్లో చెప్పలేం. గాలిలో ఉన్న అనుమానాలన్నింటికీ చెక్ పెడుతూ రేపు ట్రైలర్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేయడంతో ఒక్కసారిగా హైప్ పీక్స్‌కు వెళ్ళిపోయింది. కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బిజినెస్ విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరి మైండ్ బ్లాక్ అవుతోంది.

ఓవర్సీస్ లో ‘ధురంధర్ 2’ ప్రభంజనం మామూలుగా లేదు. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే నార్త్ అమెరికాలో 3 లక్షల డాలర్ల గ్రాస్ ను దాటేసి, మన తెలుగు స్టార్ హీరోల రికార్డులకు ఎసరు పెడుతోంది. రేపు పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బుకింగ్స్ మొదలైనా, ఈ రేంజ్ మ్యాజిక్ జరుగుతుందా అన్న సందేహాలు మొదలయ్యాయి. ఇంతటి క్రేజ్ ఉన్న సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో బయ్యర్స్ కరువు అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అయితే దీని వెనుక ఉన్న అసలు కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

నిజానికి బయ్యర్స్ లేక కాదు, సినిమా హక్కులను ఇవ్వడానికి నిర్మాతలు ససేమిరా అనడమే ఇక్కడ అసలు ట్విస్ట్. దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్ వంటి బడా సంస్థలు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం పెద్ద యుద్ధమే చేశాయి. కానీ జియో సినిమాస్ సంస్థ మాత్రం ఎవరికీ లొంగలేదు. బయ్యర్ల ద్వారా వెళ్తే వచ్చే కమీషన్ల గొడవ ఎందుకు, సొంతంగానే రిలీజ్ చేసుకుంటే వచ్చే లాభం మొత్తం మనకే మిగులుతుంది కదా అనే ధీమాతో వారున్నారు. కేవలం మల్టీప్లెక్స్‌లను నమ్ముకున్నా ఈ సినిమా సేఫ్ జోన్ లో ఉంటుందని నిర్మాతల ప్లాన్.

తెలుగు టాప్ ప్రొడ్యూసర్స్ ఆఫర్ చేసిన భారీ రేట్లను కూడా కాదన్నారంటే, ఈ సినిమా కంటెంట్ మీద వారికి ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. రేపు రాబోయే ట్రైలర్ గనుక నెక్స్ట్ లెవల్ లో ఉంటే మాత్రం, బాక్సాఫీస్ దగ్గర ‘ధురంధర్ 2’ సృష్టించే విధ్వంసం ఆపడం ఎవరి తరం కాదు. బయ్యర్లను పక్కన పెట్టి చేస్తున్న ఈ సాహసం వర్కవుట్ అయితే మాత్రం టాలీవుడ్ బిజినెస్ లెక్కలు పూర్తిగా మారిపోతాయి.

మొత్తానికి ‘ధురంధర్ 2’ మేకర్స్ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అటు ఓవర్సీస్ రికార్డులు, ఇటు లోకల్ బిజినెస్ స్ట్రాటజీ చూస్తుంటే మార్చి 19న థియేటర్లలో పూనకాలు రావడం ఖాయం అనిపిస్తోంది. మరి టాప్ ప్రొడ్యూసర్స్ ను కాదని సొంతంగా వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ కొల్లగొడుతుందో చూడాలి. ఈ సినిమా క్రేజ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి!

Similar Posts