మిల్కీ బ్యూటీ తమన్న అలాగే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ… ఇద్దరు కూడా దాదాపు రెండు సంవత్సరాలనుంచి ప్రేమించుకుంటున్నారనే సంగతి తెలిసిందే. త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నట్లు.. హింట్లు కూడా ఇచ్చారు. కానీ చివరికి ఏమైందో తెలియదు కానీ… తమ రిలేషన్ కు గుడ్ బై చెప్పి షాక్ ఇచ్చారు. అయితే ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ నేషనల్ మీడియాలో సైతం కథనాలు వస్తున్నాయి.
‘లస్ట్ స్టోరీస్ 2’ సిరీస్ చేస్తున్న టైంలో తమన్నా-విజయ్ వర్మ మధ్య ఏదో ఉందనే వార్తలు వచ్చాయి. ఆ వార్తలకి బలం చేకూర్చేలా గోవాలో ఓ న్యూఇయర్ పార్టీలో వీళ్లిద్దరూ ముద్దు పెట్టుకున్న వీడియో ఒకటి వైరల్ అయింది. ఈ సిరీస్ లో కెమిస్ట్రీ కూడా తెగ వర్కౌట్ అయింది.
ఆ తర్వాత నుంచి గత రెండు మూడేళ్లుగా జంట పక్షుల్లా తమన్నా-విజయ్ వర్మ ఎక్కడపడితే అక్కడ కనిపించారు. అలాంటిది కొన్నివారాల క్రితం వీళ్లిద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారనే న్యూస్ ఇప్పుడు బయటకొచ్చింది.
ఇద్దరు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారని… అలాగే సోషల్ మీడియాలో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను తమ తమ అకౌంట్ ల నుంచి డిలీట్ చేశారని కూడా అంటున్నారు. విడిపోయే సెలబ్రిటీలు ప్రతి ఒక్కరు ఇలాగే చేస్తారన్న సంగతి తెలిసిందే. వీళ్ళ విషయంలో కూడా అదే ప్రచారం జరుగుతోంది.
త్వరలో పెళ్లి చేసుకుంటారని ఆ మధ్య వార్తలొచ్చాయి. ఇప్పుడేమో బ్రేకప్ అని షాకిచ్చారు. రీసెంట్ టైంలో తమన్నా బయట ఒంటరిగానే కనిపిస్తోంది. దీనిబట్టి చూస్తే ఈ బ్రేకప్ వార్త నిజమేనేమో అనే సందేహం వస్తోంది.
అయితే, ఈ లవ్ బ్రేకప్ వార్తలపై ఇటు తమన్నా కానీ అటు విజయ్ కానీ స్పందించలేదు. ఇప్పటికే వారాలు గడిచినా తమ బ్రేకప్ విషయంపై వారు ఎక్కడా మాట్లాడలేదు.
తమన్నా.. తెలుగు సినిమాతోనే హీరోయిన్ అయింది. హ్యాపీడేస్, ఆవారా, 100% లవ్, బాహుబలి తదితర చిత్రాల్లో నటించి బోలెడంత ఫేమ్ తెచ్చుకుంది. గత కొన్నేళ్లుగా హిందీలోనూ మూవీస్, వెబ్ సిరీసులు చేస్తూ వచ్చింది.