టాలీవుడ్‌లో దిల్ రాజు అంటే ఒక గొప్ప ప్రొడ్యూసర్ మాత్రమే కాదు — మార్కెట్‌ని ముందే అంచనా వేసే మాస్టర్ ప్లానర్. సినిమా రిలీజవుతున్నా, కాకపోయినా… ఆయన పేరు ఏదో ఓ కొత్త ప్రాజెక్ట్‌తో వార్తల్లో ఉండటం కామన్‌! తాజాగా నితిన్ హీరోగా తెరకెక్కిన “తమ్ముడు” ప్రమోషన్స్‌లో పాల్గొన్న దిల్ రాజు, ఒక బిగ్ అనౌన్స్‌మెంట్‌ చేశాడు — అల్లు అర్జున్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌ సినిమా తమ బ్యానర్‌లో ఫిక్స్ అయిందని.

ఈ హై వోల్టేజ్ కాంబో ప్రాజెక్ట్ పేరు — “రావణం”.

KGF సిరీస్‌, సలార్ సినిమాలతో నేషనల్ లెవెల్‌కి వెళ్లిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం, అల్లు అర్జున్‌ను మరింత మాస్‌ ఓరియెంటెడ్ గెటప్‌లో చూపించబోతోంది.

ఇది దిల్ రాజు ప్రొడక్షన్‌ హౌస్‌లో తెరకెక్కనుండగా, ప్రాజెక్ట్ క్లియర్‌గా లాక్ అయ్యిందని, కానీ కొన్ని ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఇది కొంత ఆలస్యంగా ప్రారంభమవుతుందని దిల్ రాజు స్పష్టం చేశారు.

ఇక తమ్ముడు సినిమాకి దిల్ రాజు ఏకంగా రూ.75 కోట్ల భారీ బడ్జెట్ పెట్టడం చూస్తే… ఆయన కొత్త తరహా రిస్క్‌లు తీసుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. అంతేకాకుండా, “Dil Raju Dreams” అనే ప్లాట్‌ఫారమ్‌ను కూడా ప్రారంభించి, యువ దర్శకుల్ని ప్రోత్సహించేందుకు సిద్ధమయ్యారు.

అల్లు అర్జున్ – ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ కాంబోను దిల్ రాజు బ్యానర్‌లో లాక్ చేయడమే… ఇండస్ట్రీలో అతని ప్లానింగ్‌కి ఇంకో బెంచ్‌మార్క్!

, , ,
You may also like
Latest Posts from