మలయాళ సూపర్‌స్టార్ దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ హౌస్ Wayfarer Films తన తాజా సినిమా లోకహ్ చాప్టర్ వన్: చంద్రపై వచ్చిన విమర్శలతో సీరియస్‌గా స్పందించింది.

ఈ వివాదం వెనుక కారణం? సినిమాలో ఒక విలన్ పలికిన డైలాగ్. ఆ డైలాగ్‌లో బెంగళూరు మహిళలను అవమానించేలా ఉందని సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

దీంతో, సెప్టెంబర్ 2న విడుదల చేసిన అధికారిక ప్రకటనలో “ఇది పూర్తిగా ఒక oversight, ఎవరినీ బాధపెట్టే ఉద్దేశం మా దగ్గర లేదు” అని స్పష్టం చేస్తూ, ఆ డైలాగ్‌ను వెంటనే తొలగించబోతున్నట్టు ప్రకటించారు.

అసలేం జరిగింది

మలయాళ చిత్రం కొత్త లోక ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 30 కోట్లకు పైగా నికర వసూళ్లను సాధించింది. ఈ మూవీలో కళ్యాణి ప్రియదర్శన్, నస్లెన్, శాండీ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు.

అయితే ఈ సినిమాలోని ఓ సీన్‌ వివాదానికి దారితీసింది. ఇన్‌స్పెక్టర్ నాచియప్ప గౌడ (కొరియోగ్రాఫర్ శాండీ పోషించిన పాత్ర) బెంగళూరుకు చెందిన మహిళలను వివాహం చేసుకోవడం ఇష్టం లేదని.. వారు క్యారెక్టర్‌ లెస్‌ అంటూ మాట్లాడారు. ఈ సీన్‌ బెంగళూరు మహిళలను కించపరిచేలా ఉందని సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. బెంగళూరు మహిళలను కించపరిచేలా ఉందంటూ విమర్శలొచ్చాయి.

దీంతో దుల్కర్ సల్మాన్‌కు చెందిన నిర్మాణ సంస్థ వేఫరర్‌ ఫిల్మ్స్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మీ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న ఆ సన్నివేశాన్ని తొలగిస్తామని ట్వీట్ చేసింది. కన్నడ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నందుకు విచారం వ్యక్తం చేస్తున్నామని తెలిపింది. ఈ విషయంలో తమను క్షమించాలని కోరుతూ వేఫరర్‌ ఫిల్మ్స్‌ లేఖను పోస్ట్‌ చేశారు.

, , , , ,
You may also like
Latest Posts from