
విజువల్స్ గ్రాండ్… కానీ : దుల్కర్ ‘కాంత’ రివ్యూ
పేరున్న దర్శకుడు అయ్య (సముద్రఖని) జీవితకాల డ్రీమ్ ఏమిటంటే – తన తల్లి ‘శాంత’ కథను పెద్ద తెరపై చూపటం. అందులో హీరోగా అతని ప్రియ శిష్యుడు మహదేవన్ (దుల్కర్ సల్మాన్)ని చూపించాలనుకుంటాడు. అయితే ఇప్పుడు పరిస్దితులు వేరుగా ఉన్నాయి. ఒకప్పుడు అయ్య మాటకు మాట ఎదురు చెప్పని శిష్యుడు…మహదేవన్. ఇప్పడు స్టార్ అయ్యాక ఏటిట్యూడ్ మారిపోతుంది. ఈగో క్లాష్‌లు తీవ్రంగా పెరిగి, గురు–శిష్యుల మధ్య దూరం పెరుగుతుంది.
ఒకసారి షూటింగ్ మొదలై మొదట్లోనే ఆగిపోయిన ‘శాంత’, ఏళ్ల తర్వాత మళ్లీ పునఃప్రారంభమవుతుంది. కానీ ఈసారి ఆట మొత్తం మహదేవన్ నియంత్రణలో! టైటిల్ ‘శాంత’ వద్దు, ‘కాంత’ కావాలి. క్లైమాక్స్ నా ఇమేజ్‌కి తగ్గట్టు ఉండాలి. అంటూ మహదేవన్ సెట్‌పై పట్టు చూపిస్తాడు. ఇక హీరోయిన్గా రంగంలోకి వచ్చే కుమారి (భాగ్యశ్రీ బోర్సే) పూర్తిగా అయ్య శిష్యురాలు. గురువు చెప్పిందే ధర్మం అనుకునే ఆమె, హీరో చెప్పేవి పట్టించుకోదు.
మొదట ఇది మహదేవన్‌కు అసహ్యం. కానీ… ఆమె అందం, ప్రతిభ చూసి మెల్లిగా ఆకర్షితుడు అవుతాడు. చివరికి ప్రేమలో పడతాడు కూడా. దాంతో దర్శకుడు, హీరో మధ్యలో చిక్కుకున్న కుమారి ఇబ్బందిపడుతుంది. గురు-శిష్యుల మధ్య రాజీకి ప్రయత్నించింది. కానీ అది కుదరదు. సెట్ మొత్తం టెన్షన్‌తో నిండిపోతుంది. చివరకు… ఎన్నో ఇబ్బందులు దాటుకుని ‘కాంత’ షూటింగ్ దాదాపు పూర్తవుతుంది. ఒక్క సీన్ మిగిలి ఉండగానే… అప్పటికే సెట్‌పై ఓ పెద్ద షాక్ జరుగుతుంది! ఓ మర్డర్ జరుగుతుంది.
ఇక్కడే అసలు మిస్టరీ మొదలు… ఎవరి క్లైమాక్స్‌తో సినిమా పూర్తయింది? చివరి రోజున సెట్స్‌లో ఏం జరిగిందో? గురు–శిష్యుల మధ్య విభేదం అసలు ఎక్కడ నుంచి మొదలైంది? చివరకు ఈ సినిమా పూర్తైందా..ఎవరి హత్య జరిగింది. ఎవరు చేసారు. ఇందులో రానా పాత్ర ఏమిటి వంటివిషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
థ్రిల్లర్ల సమస్య ఏమిటంటే – ఇప్పటి ప్రేక్షకులు చాలా షార్ప్. సెటప్ లో తక్కువ పాత్రలలే ఉన్నప్పుడు, సందేహితులు కొద్దిమందే ఉన్నప్పుడు, “కిల్లర్ ఎవరు?” అనే ప్రశ్నను గెస్ చేయడం వారికి ఈజీ అయిపోయింది. ఇలాంటి సెటప్ లో నిజంగా సర్ప్రైజ్ ఇవ్వడం స్క్రీన్‌ప్లే స్థాయిలో పెద్ద సవాలు. ఇదే సమయంలో ‘కాంత’ ఎంచుకున్న మార్గం ఆసక్తికరం
“డేవిడ్ ఫించర్ మాంక్”కి ఉన్న రెట్రో సినీమాటిక్ టెక్స్చర్, “ఆగతా క్రిస్టీ”కి ఉన్న మిస్టరీ బిల్డింగ్, ఈ రెండింటి ఫ్లేవర్‌తో ‘కాంత’ తనను తాను బాగానే ప్రెజెంట్ చేసుకుంటుంది. కానీ స్క్రీన్‌ప్లే అసలు ఎక్కడ గేర్ మార్చిందంటే— ఇది “ఎవరు చంపాడు?” అనేది తెలుసుకోవడమే లక్ష్యం కాదు, దానిని ఒక ఎరగా వేసి… ప్రేక్షకుడిని “ఎందుకు చంపాడు?” అనే కోర్ కాంప్లిక్ట్స్ కి తీసుకెళ్లడం. ఇది స్క్రీన్‌రైటింగ్ లెవెల్లో ‘కాంత’ తీసుకున్న ధైర్యమైన నిర్ణయం:
ఈ నిర్ణయం బలమైన థీమ్‌కు దారితీస్తుంది—ఇగో, వినాశనం, ప్రేమ, పగ — ఇవన్నీ వ్యక్తిని ఎంత దారుణమైన దిశలో తీసుకెళ్తాయో చెప్పాలి. కానీ సమస్య ఏమిటంటే… ఈ ట్రాన్సిషన్ జరిగే టైం, దాన్ని క్యారీ చేసే ఎమోషనల్ బీట్స్, ఇంపాక్ట్ ఇచ్చేలా లేవు. అంటే— ఆ ఆలోచన అద్భుతం, కాని దానికి అవసరమైన డ్రమిటెక్ ఎలివేషన్ పూర్తిగా బిల్డ్ కాలేదు.
టెక్నికల్ గా …
ఆ కాలంలో నటులకి ఉన్న aura, అనుభవం, అహం, కళ మీద ఉన్న మక్కువ, అప్పటి నటనలో ఉండే కొంత theatrical flavour…వీటిని అన్నింటినీ దర్శకుడు పాతపద్దతిలో కాకుండా, modern cinematic sensibilityతో చూపించాడు. అందుకే ఫస్ట్ హాఫ్ మొత్తం గ్రిప్పింగ్‌గా అనిపిస్తుంది. కథ ఇంటర్వల్ తర్వాత murder mystery జానర్లోకి దూకుతుంది.
ఈ సమయంలో దర్శకుడు అవసరమైన groundwork బాగా తయారు చేయలేకపోయాడు. ఇప్పుడు అసలు ‘రిస్కీ జోన్’. ఓ థ్రిల్లర్‌లో, “ఎవరు?” అనే ప్రశ్న నుంచి “ఎందుకు చేశాడు?” అనే psychological depthకి వచ్చేటప్పుడు స్క్రీన్‌ప్లే tone drasticగా మారాలి. ఇక్కడే “కాంత” తడబడింది.
నటీనటుల్లో …
దుల్కర్ సల్మాన్ – మహదేవన్ పాత్రలో కెరీర్లోనే కఠినమైన ఛాలెంజ్ ని ఎదుర్కొన్నారని చెప్పాలి. సముద్రఖని – అయ్యగా పర్ఫెక్ట్ ఫిట్. భాగ్యశ్రీ బోర్సే – అందం మాత్రమే కాదు, భావాలను కూడా మోసింది.రానా దగ్గుబాటి – ఫీనిక్స్‌గా వచ్చి సినిమా గేర్ మార్చిన వ్యక్తి.
చూడచ్చా
దుల్కర్ అభిమానులు ఓ లుక్కేయచ్చు. నచ్చుతుంది. మిగతా వాళ్లకు సోసోగా అనిపిస్తుంది.
ఫైనల్ గా
“కాంత” ప్రపంచం అద్భుతంగా తయారైంది… డ్రామా బలంగా ఉంది… పాత్రలు కూడా పంచ్‌తో నిలిచాయి. కాని కథ ‘ఎవరు చేశాడు?’ నుంచి ‘ఎందుకు చేశాడు?’కి మారే ఆ కీలక ఎమోషన్ ఇంకా ఘాటుగా ఉండి ఉంటే— ఇది ఇప్పటివరకు వచ్చిన రేట్రో మిస్టరీ సినిమాల్లో టాప్‌లో నిలిచేదే.”
