కొద్ది సంవత్సరాల క్రితం అల్లు అర్జున్ చేసిన “చెప్పను బ్రదర్” కామెంట్ ఎంత వైరల్ అయ్యిందో తెలిసిందే. అలాగే ఆ కామెంట్ తో ఆయన పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. స్టేజ్‌పై పవన్ పేరు ప్రస్తావించమని అభిమానులు కోరినప్పుడు, ఆయన స్పష్టంగా నిరాకరించడం రెండు అభిమాన గుంపుల మధ్య విభేదాలకు దారితీసింది.
తరువాతి కాలంలో ఈ విభేదం మరింత పెరిగింది. ముఖ్యంగా, పవన్ కళ్యాణ్ జనసేన పోటీ చేసిన ఎన్నికల్లో, అల్లు అర్జున్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయడం, ఆయన చిరంజీవి–పవన్ కళ్యాణ్ కుటుంబానికి దూరమయ్యారని అనిపించేలా చేసింది.
అయితే, కాలం మారింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ, జాతీయ రాజకీయాల్లోనూ ఎన్డీఏలో కీలక స్థానాన్ని సంపాదించారు. మరోవైపు, పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగిన థియేటర్ స్టాంపీడ్ కేసుతో డైరక్ట్ గా సంబంధం లేకపోయినా, ఆ ఘటనలో తాత్కాలికంగా జైలుకెళ్లిన తర్వాత అల్లు అర్జున్ వైఖరి మరింత మారిందిది.
https://twitter.com/alluarjun/status/1962707240072474917
ఇటీవలి నెలల్లో అల్లు అర్జున్, ఆయన తండ్రి అల్లు అరవింద్ మెగా ఫ్యామిలీతో సన్నిహితంగా ఉండేందుకు కృషి చేస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా, అల్లు అర్జున్ అమ్మమ్మ అల్లు కనకరత్నం మృతి తర్వాత రెండు కుటుంబాలు ఒకచోట చేరడం ఈ కలయికకు నిదర్శనమైంది.
ఈ నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భాన్ని అల్లు అర్జున్ వదులుకోలేదు. ఉదయం మొదటిసారిగానే సోషల్ మీడియాలో ఆయనతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.