“దేవర” తో ఎన్టీఆర్ మంచి ఊపు మీద ఉన్నారు. ఒక రేంజ్ లో సక్సెస్ ఎంజాయ్ చేస్తూ వరస సినిమాలు కమిట్ అవుతున్నాడు. తన నెక్ట్స్ సినిమాలు ఆచి,తూచి ముందుకు వెళ్తున్నాడు. సినిమా హిట్ టాక్ తో పాటు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబట్టే ప్రాజెక్టులను ఎంచుకుంటున్నాడు.ఆ క్రమంలో ఇప్పటికే బాలీవుడ్ డెబ్యూ సినిమా వార్ -2 లో నటిస్తున్నాడు తారక్. ఆగష్టు 2025లో విడుదల కానుంది వార్ – 2.
అలాగే కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాను ఈ మధ్య మొదలెట్టాడు ఈ సినిమా సంక్రాంతికి 2026లో విడుదల కానుంది. ఈ రెండు సినిమాలతో పాటు పలు కథలు వింటున్నాడు ఎన్టీఆర్ .
ఈ నేపథ్యంలో తమిళ స్టార్ దర్శకుడు జైలర్, బీస్ట్ వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన నెల్సన్ దిలీప్కుమార్తో కలిసి కథ చర్చలు చేసారని గత నెల మొదట్లోనే టాక్ నడిచింది. ఇప్పుడు దానికి సంబంధించి అప్డేట్ వచ్చింది. ఫైనల్ రౌండ్స్ చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. ఆ చిత్రం టైటిల్ ఫైనల్ అయ్యిందని తెలుస్తోంది. ఆ టైటిల్ మరేదో కాదు ‘ROCK’.
నెల్సన్ ప్రస్తుతం “జైలర్ 2” పై తెరకెక్కించే పనిలో ఉన్నాడు, ఇది 2026లో విడుదల కానుంది. అన్నీ ప్లాన్ ప్రకారం జరిగితే, 2026లో ఎన్టీఆర్ మరియు నెల్సన్ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని సితార సంస్థ నిర్మించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.