తలైవా రజినీకాంత్ ప్రధాన పాత్రలో, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కూలీ’ ఇప్పుడే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఎల్‌సీయూ (Lokesh Cinematic Universe) లో వచ్చే ఈ మూవీపై ఇప్పటికే అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయిలో ఉంది. రజినీ మాస్ లుక్, పోస్టర్లు చూస్తుంటేనే సినిమా థియేటర్లను ఊపేస్తుందని అర్థమవుతోంది. ఈ భారీ యాక్షన్ డ్రామాలో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనుండటంతో హైప్ మరింత పెరిగింది.
ఇక ఇప్పుడు అభిమానులను ఇంకాస్త ఎగ్జైట్ చేసే అప్డేట్ వచ్చేసింది. ముందుగా “ట్రైలర్ ఉండదేమో, డైరెక్ట్‌గా సినిమానే చూడు” అంటూ మీడియాలో గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కూలీ ట్రైలర్ ఇక రాదని అందరూ ఫిక్సైపోయారు. కానీ మేకర్స్ ఆశ్చర్యపరిచేలా ఆకస్మాత్తుగా ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించారు.
ఆగస్టు 2న ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నట్టు సన్ పిక్చర్స్ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. దాంతో అసలు ఏం జరిగింది…ట్రైలర్ వద్దనుకున్నవాళ్లు ఎందుకు నిర్ణయం మార్చుకున్నారు, రజనీకాంత్ ట్రైలర్ కోసం అడిగారా లేక డిస్ట్రిబ్యూటర్స్ అడుగుతున్నారా..నిర్మాత సడెన్ డెసిషన్ వెనుక ఏం జరిగిందనేది తమిళనాట హాట్ టాపిక్ గా మారింది.
కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ హై బడ్జెట్ ప్యాన్ ఇండియా సినిమాకు ఇప్పటికే టీజర్ తోనే క్రేజ్ క్రాస్ ఫైర్ లెవల్‌కి వెళ్లిపోయింది. ట్రైలర్‌తో మరింత ఫ్యూయల్ చల్లి, ఆగస్టు 14న థియేటర్లలో రజినీ రాక కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
అసలు ట్రైలర్ ఉండదనుకున్న సినిమా… ఇప్పుడు ట్రైలర్‌తోనే మరోసారి మాస్ క్రేజ్‌ను రీచార్జ్ చేసేందుకు రెడీ అవుతోంది. కూలీ… రాబోతున్నాడు!