రిలీజ్ కు ముందు గేమ్ ఛేంజర్ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆర్.ఆర్. ఆర్ వంటి మెగా బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వచ్చిన సినిమానే గేమ్ చేంజర్. అలాగే రూ.350 కోట్లకు పైగా బడ్జెట్ తో దిల్ రాజు తన బ్యానర్లో 50వ సినిమాగా గేమ్ చేంజర్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చాడు. ఎన్నో అంచనాలతో, ప్రత్యేకలతో వచ్చిన ఈ సినిమా మార్నింగ్ షో నుంచే నెగిటివ్ టాక్ మూట కట్టుకుంది. అయితే మేకర్స్ మాత్రం కలెక్షన్స్ పరంగా అదిరిపోయిందని పోస్టర్ వదిలితే అదీ ట్రోలింగ్ కు గురి అయ్యింది. ఇప్పుడు ఎక్కడా కలెక్షన్స్ అనేవి లేవు. సంక్రాంతి సీజన్ అయ్యిపోగానే దాదాపు థియేటర్ రన్ క్లోజై షాక్ ఇస్తోంది.

పండగ రోజుల్లో కూడా పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయిన ఈ సినిమా సంక్రాంతి పండుగ తర్వాత పూర్తిగా కుప్పకూలింది.

ఇప్పుడు థియేటర్ల యజమానులు అద్దెలు కూడా రాబట్టలేక లోటులో పడ్డారు.

దీంతో గేమ్ ఛేంజర్ 2 వారాల లోపే బాక్స్ ఆఫీస్ వద్ద థియేట్రికల్ రన్ ముగించిందని ట్రేడ్ తేల్చింది.

గేమ్ ఛేంజర్ యొక్క తెలుగు వెర్షన్ దాదాపు 85 కోట్ల షేర్ వసూలు చేసింది.

అన్ని వెర్షన్ల మొత్తం షేర్ 100 కోట్ల వరకు ఉంటుంది. పొలిటికల్ యాక్షన్ డ్రామా బిజినెస్‌లో 50% కూడా రికవర్ చేయలేకపోయింది.

సంక్రాంతికి వస్తున్నాతో పాటు గేమ్ ఛేంజర్ ని కొనుగోలు చేయడంతో తెలుగు బయ్యర్లు ఒకరకంగా అదృష్టవంతులు.

, , ,
You may also like
Latest Posts from