అనుష్క శెట్టి సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకున్న క్రేజ్ వేరు. ముఖ్యంగా కొంత గ్యాప్ తర్వాత ఆమె నటించిన ‘ఘాటీ’ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేపింది. విడుదల తేదీలు పలుమార్లు మారినా, సినిమా మీద హైప్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలోనే ఇండస్ట్రీలో పెద్ద చర్చ నడుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, ‘ఘాటీ’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో తీసుకున్నట్లు తెలిసింది. అందుకోసం భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిందట. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో ‘ఘాటీ’ విడుదల కానుంది. ‘బాహుబలి’తో అనుష్కకు పాన్ ఇండియా లెవెల్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది.
అటు క్రిష్ కూడా హిందీలో సినిమాలు తీసి ఉన్నారు. ఇందులో తమిళ నటుడు విక్రమ్ ప్రభు ఒక కీలక పాత్ర చేశారు. అందువల్ల సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ మంచి రేటు పలికాయి. సుమారు 36 కోట్ల రూపాయలు ఆఫర్ చేసి అమేజాన్ ఈ రైట్స్ తీసుకుందట.
నిర్మాత స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, “మేము ఈ డీల్‌ను చాలా రోజుల క్రితమే ఫైనలైజ్ చేశాం. ధర కూడా మాకు సంతృప్తికరంగానే వచ్చింది” అన్నారు.
ఇక థియేట్రికల్ బిజినెస్ కూడా సూపర్ రేంజ్‌లోనే జరుగుతోందని టాక్. ఆంధ్రప్రదేశ్ హక్కులకు 10 కోట్లు, సీడెడ్ 4 కోట్లు, నిజాం 7 కోట్లకు డిమాండ్ వస్తోందని ఇండస్ట్రీ టాక్. అంటే అనుష్క క్రేజ్ బాక్సాఫీస్ దగ్గర కూడా బంగారం మాదిరే అనిపిస్తోంది.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ యాక్షన్ డ్రామా ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుని, U/A సర్టిఫికేట్ పొందింది. సెప్టెంబర్ 5న గ్రాండ్ రిలీజ్‌కు సిద్దమవుతోంది.
అనుష్క శెట్టి యొక్క పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, క్రేజ్, మరోవైపు భారీ స్కేల్‌లో తెరకెక్కిన ఘాటీ – ఈ రెండు కలిపి సినిమా మీద హైప్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లాయి. విక్రమ్ ప్రభు కీలక పాత్రలో కనిపించే ఈ చిత్రం, థియేటర్లలో అనుష్కను మళ్లీ చూడాలని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి నిజంగా పండగే కానుంది.