మహాత్ముడి(Gandhi) జీవితంపై ఇప్పటికే అనేక సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఆయన జీవితంపై ఓ వెబ్‌సిరీస్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రముఖ హిందీ దర్శకుడు హన్సల్‌ మెహతా (Hansal Mehta) దీనికి దర్శకత్వం వహించనున్నారు. గాంధీ పాత్రలో గుజరాతీ నటుడు ప్రతీక్‌ గాంధీ (Pratik Gandhi) నటించనున్నారు. భారత స్వాతంత్య్ర పోరాట కాలం నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపెట్టడానికి అప్లాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ సన్నాహాలు చేస్తోంది.

ప్రముఖ రచయిత రామచంద్ర గుహ రాసిన ‘గాంధీ బిఫోర్‌ ఇండియా’, ‘గాంధీ: ది ఇయర్స్‌ దట్‌ ఛేంజ్డ్‌ ది వరల్డ్‌’ రచనల ఆధారంగా ఈ సిరీస్‌ తెరకెక్కుతోంది.

నాలుగేళ్లుగా హన్సల్ మెహతా డైరెక్షన్‌లో నిర్మాణం సాగుతున్న భారీ వెబ్ సిరీస్ ‘గాంధీ’ రిలీజ్ అవకముందే ఓ అంతర్జాతీయ మైలురాయిని అందుకుంది. మహాత్మా గాంధీ జీవితగాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సిరీస్‌లో ప్రతీక్ గాంధీ టైటిల్ రోల్‌లో నటిస్తున్నారు.

ఇక బిగ్ అప్‌డేట్ ఏంటంటే – ‘గాంధీ’ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF)లోని ప్రతిష్టాత్మక ప్రైమ్‌టైమ్ స్లేట్‌కి సెలెక్ట్ అయ్యింది. TIFF ప్రైమ్‌టైమ్‌కి ఎప్పటినుంచో వెబ్ సిరీస్‌లే వస్తున్నా… ఈ లిస్ట్‌లో ఫస్ట్ టైమ్ ఒక ఇండియన్ సిరీస్ చేరింది.

ప్రతీక్ గాంధీ లేటెస్ట్ లుక్ కూడా రిలీజ్

అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ హౌస్ ఈ హ్యాపీ న్యూస్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ – “మా గాంధీ సిరీస్ ప్రపంచ ప్రీమియర్ TIFF 50వ ఎడిషన్‌లో జరుగుతుంది… ఇది ప్రైమ్‌టైమ్‌లోకి వచ్చిన తొలి భారతీయ సిరీస్” అని అనౌన్స్ చేసింది. అదే సమయంలో ప్రతీక్ గాంధీని గాంధీ గెటప్‌లో కనిపించే న్యూ స్టిల్‌ని కూడా విడుదల చేసింది.

హాలీవుడ్ + ఇండియన్ స్టార్స్ కాంబో

ఈ సిరీస్‌లో ఇండియన్ యాక్టర్స్‌తో పాటు హాలీవుడ్ నటీనటులు కూడా ఉన్నారు. హ్యారీ పాటర్ ఫేమ్ టామ్ ఫెల్టన్, లిబ్బీ మే, మాలీ రైట్, రాల్ఫ్ అడెనీ, జేమ్స్ ముర్రే, లిండన్ అలెగ్జాండర్, జోనో డేవిస్, సైమన్ లెనన్ ఇలా ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు యాక్షన్‌లోకి వస్తున్నారు. భామిని ఓజా – కస్తూర్బా గాంధీ పాత్రలో కనిపించనున్నారు. ఇండియన్ కాస్ట్ షూటింగ్‌ను జనవరి 19న ప్రారంభించింది.

హన్సల్ మెహతా మాటల్లో…

“లండన్, సౌత్ ఆఫ్రికాలో గడిపిన గాంధీజీ యంగ్ ఏజ్ స్టోరీ – ఇదివరకెప్పుడూ ఈ లోతులో చెప్పని కానీ చాలా పవర్‌ఫుల్ జర్నీ. ఒక సాధారణ యువకుడు చేసిన స్వీయ ఆవిష్కరణ యాత్ర… అది చరిత్రని, మన సమూహ మనస్తత్వాన్ని మార్చేసింది. ఈ ఎపిక్ కథని ప్రపంచానికి చెప్పే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నా” అని హన్సల్ చెప్పారు.

స్టాక్‌ మార్కెట్‌ స్కామ్‌ నేపథ్యంలో ప్రతీక్‌ గాంధీ నటించిన ‘స్కామ్‌ 1992’ సిరీస్‌కి హన్సల్‌ మెహతాయే దర్శకత్వం వహించారు.

, , , ,
You may also like
Latest Posts from