తెలుగుతెరపై “దేశముదురు”తో పరిచయమైన ఫెయిరీ లుక్‌ హన్సిక మోత్వానీ, ఓప్పుడు క్యూట్ హీరోయిన్‌గానే కాదు – డ్రీమ్‌గాళ్స్‌ లిస్ట్‌లో ముందు వరుసలో నిలిచింది. కానీ ఇప్పుడు ఆమె జీవితంలో ఓ షాకింగ్ టర్న్ కు చెందిన వార్తలు వస్తున్నాయి.

ఇటీవల కాలంలో హీరోయిన్స్ పెళ్లి వార్తల కన్నా… విడాకుల మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. నాగ చైతన్య-సమంత నుంచి, ధనుష్, నిహారిక, జీవి ప్రకాష్ వరకు… విడాకుల జాబితా లెంగ్త్ పెరుగుతూనే ఉంది. ఇప్పుడు అదే బాటలోకి హన్సిక కూడా చేరినట్టుగా వార్తలు చెబుతున్నాయి.

‘పబ్లిక్ లో కనిపించని ప్రైవేట్ లైఫ్’

హన్సిక, 2022లో వ్యాపారవేత్త సోహెల్ కత్రియాతో గ్రాండ్ వెడ్డింగ్ చేసుకొని అందర్నీ మెస్మరైజ్ చేసింది. అంతా పర్ఫెక్ట్ జంటలాగే అనిపించింది. కానీ… గత ఏడాదిగా ఆమె భర్తతో ఒక్క ఫొటో, ఒక్క పోస్టూ సోషల్ మీడియాలో లేకపోవడం, ఎవెంట్‌లకు సింగల్‌గా రావడం వల్ల పుకార్లు మోత మోగుతున్నాయి.

తాజాగా తమిళ మీడియా కథనాల ప్రకారం – హన్సిక విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించబోతున్నదనే గాసిప్ స్పీడ్ పెరిగింది. ఈ వార్తలపై సోహెల్ స్పందిస్తూ, “విడాకుల సంగతి అబద్దం” అని క్లారిటీ ఇచ్చాడు గానీ… “ఇద్దరూ కలిసే ఉన్నారా? విడిగా ఉన్నామా?” అనే అసలు విషయంపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇది మరింత సందేహానికి తావిస్తోంది.

ఇంతలో ఇంటర్వెన్షన్ – కుటుంబ కలహాల మోత

ఇన్‌సైడ్ టాక్ ప్రకారం – హన్సిక, సోహెల్ కుటుంబాల మధ్య ఇటీవల విభేదాలు తలెత్తాయని వార్తలు వినిపిస్తున్నాయి. సోహెల్‌కి ఇదే రెండో పెళ్లి. హన్సిక్‌కి మొదటి. వాళ్ల మధ్య వ్యక్తిగత డైనమిక్స్ కూడా పుకార్లను బలపరుస్తున్నాయి.

రియల్ లైఫ్ డ్రామా… ఆన్‌స్క్రీన్ హీరోయిన్!

సినిమాల్లో ఎంత డైలాగ్ చెప్పినా సరే, రియల్ లైఫ్‌లో మౌనం ఎక్కువ బరువు వేసే మాట. ప్రస్తుతం హన్సిక అదే దశలో ఉంది. అభిమానులు ఆశిస్తున్న మాట ఏంటంటే – ఇది తాత్కాలిక గ్యాప్ మాత్రమే అయ్యి, మళ్లీ వీరిద్దరూ కలిసి హ్యాపీగా కనిపించాలని.

,
You may also like
Latest Posts from