పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – దర్శకుడు క్రిష్ జాగర్లమూడి – లెజెండరీ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం… ఈ కాంబినేషన్‌లో సినిమా ప్రకటించగానే తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఎంతటి హైప్ క్రియేట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ చుట్టూ క్రేజ్, బజ్ ఏర్పడింది.

కానీ ఆరంభంలో ఉన్న ఆతృత, ఎగ్జైట్‌మెంట్ చివరికి విసుగుగా మారింది. ఎన్నో ఆలస్యాలు, మారిన స్క్రిప్ట్‌లు, బహిరంగంగా బయటకు వచ్చిన సమస్యలు… ఇలా ఒక దశకు ‘హరి హర వీరమల్లు’ రిలీజ్ అవుతుందా లేదా? అన్న అనుమానమే పెరిగిపోయింది. చివరికి సినిమా విడుదలైనా – ప్రేక్షకులు ఊహించిన స్థాయిలో మ్యాజిక్ చూపించలేకపోయింది.

ఫలితంగా పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే భారీ నష్టాలను తెచ్చిన సినిమాగా నిలిచింది. నిర్మాతలతో పాటు బయ్యర్లకు కూడా ఈ ప్రాజెక్ట్ పెద్ద దెబ్బతీసింది.

అసలు ప్లాన్ చేసిన కథ తెరకెక్కి ఉంటే ఫలితం వేరుగా ఉండేదేమో అనేది చాలా మందిలో ఉన్న అభిప్రాయం. దీనికి తాజాగా దర్శకుడు క్రిష్ చేసిన వ్యాఖ్యలే మరింత బలాన్ని ఇచ్చాయి. ఆయన ప్రకారం, ఢిల్లీ కోటలో ఔరంగజేబు వద్ద ఉన్న కోహినూర్ వజ్రాన్ని దోచుకురావడం అనేది సినిమాలో సెకండ్ హాఫ్‌లో కీలక ఎపిసోడ్‌గా ఉండాల్సింది. కానీ దానిని పక్కన పెట్టి, హీరోను “సనాతన ధర్మ పరిరక్షకుడు”గా చూపించే కొత్త ఎపిసోడ్లు జోడించడంతో అసలు కథ పక్కదారి పట్టిందని తెలుస్తోంది.

క్రిష్ తనే షూట్ చేసిన 40 నిమిషాల హై వోల్టేజ్ ఎపిసోడ్‌ను సెకండ్ పార్ట్ కోసం పక్కన పెట్టిన విషయాన్ని బహిరంగంగా వెల్లడించాడు. ఆ సీక్వెన్స్ గురించి ఆయన చెప్పిన మాటలు వింటే పవన్ అభిమానులకు గూస్‌బంప్స్ రావడం సహజం.

అయితే ‘హరి హర వీరమల్లు’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో ఇక రెండో భాగం తీసే ఛాన్స్ లేదు. అలాంటప్పుడు – ఆ షూట్ చేసిన ఎపిసోడ్ పరిస్థితి ఏమిటి? దాన్ని వేరే పేరుతో మినీ ఫిల్మ్‌లా ఓటీటీలో రిలీజ్ చేస్తారా? లేక యూట్యూబ్‌లో వదులుతారా? అన్న ఆసక్తి ఇప్పుడు పెరిగింది.

ప్రేక్షకుల దృష్టిలో ఈ కంటెంట్ పక్కన పడేయకుండా ఏదో ఒక రూపంలో బయటికి రావడం ఖాయం. నిర్మాత రత్నం కూడా అలా చేస్తే కనీసం కొంతమేర నష్టాలను తిరిగి సాధించుకునే అవకాశముంది.

, , , ,
You may also like
Latest Posts from