హిట్ 3 – పేరులోనే హిట్ ఉన్నా, వసూళ్ల లెక్కల్లో మాత్రం క్లారిటీ లేదు. నిర్మాతలు విడుదల చేస్తున్న పోస్టర్ల ప్రకారం ఈ సినిమా నాలుగు రోజుల్లోనే ₹101 కోట్లు గ్రాస్ వసూలు చేసిందని చెబుతున్నారు. కానీ ట్రేడ్ వర్గాల్లో మాత్రం ఈ నంబర్లు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఒక్కో ఏరియాలో సినిమా బ్రేక్ ఈవెన్ దాటేసిందనే ప్రచారం ఉన్నా… ఫ్యాక్ట్స్ చూస్తే కొన్ని ప్రాంతాల్లో కలెక్షన్స్ డ్రాప్ భారీగా కనపడుతోంది. అసలేం జరుగుతోంది.
నేచురల్‌స్టార్ నాని హీరోగా యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన చిత్రం హిట్ 3. కన్నడ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను నాని నటిస్తూ నిర్మించాడు. మే 1న భారీ అంచనాల మధ్య వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన హిట్ 3 హిట్ అనే టాక్ అయితే రాబట్టింది. కానీ వైలెన్స్ ఎక్కువగా ఉంది అనే మాట వినిపించింది. అదే ఇంపాక్ట్ కలెక్షన్స్ లోనూ కనపడుతోంది.
తాజాగా నిర్మాతలు విడుదల చేసిన పోస్టర్ ప్రకారం, ఈ సినిమా నాలుగు రోజుల్లోనే వందకోట్ల మార్క్‌ను క్రాస్ చేసి ₹101 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే వసూళ్ల తీరులో కొన్ని ఏరియాల్లో మిశ్రమంగా కనిపిస్తోంది.
నైజాంలో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ చేరుకుంది (రూ. 11 కోట్లు), కానీ ఆంధ్రాలో మాత్రం తేడా స్పష్టంగా కనిపిస్తోంది.
ఉత్తరాంధ్ర బ్రేక్ ఈవెన్‌కు దగ్గరగా వెళ్లగా,
ఈస్ట్, వెస్ట్, కృష్ణాలో ఇంకా ఫైట్ కొనసాగుతోంది.
గుంటూరులోనూ స్పీడ్ మందగించింది.
విజయవాడ లాంటి మాస్ హబ్‌లో ఆదివారం హౌస్‌ఫుల్ షోస్ రాకపోవడం familly audience కొంత దూరంగా ఉన్నారన్న సంకేతాలిస్తోంది.
అయితే బాక్సాఫీస్ ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ఫైనల్ రన్‌లో ఈ సినిమా మంచి వసూళ్లు అందుకునే అవకాశముంది. కానీ మే 9న రాబోతున్న శ్రీ విష్ణు మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే, ‘హిట్ 3’ కలెక్షన్లపై ప్రభావం తప్పదు.
వయలెన్స్ ఉన్నా.. కథ తాలూకు గ్రిప్ ఆడియెన్స్‌ను థియేటర్లకు తీసుకొచ్చిందనేది స్పష్టమవుతోంది. కానీ ఫ్యామిలీ ఆడియెన్స్ దూరంగా ఉండటం దెబ్బ కొడుతోంది.