అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ #AA22xA6 షూట్ ముంబైలో జోరుగా జరుగుతోంది. స్పెషల్‌గా డిజైన్ చేసిన సెట్ పై పని చేయటానికి , హాలీవుడ్ టెక్నీషియన్స్ ని కూడా అట్లీ తీసుకొచ్చాడు. సై-ఫై + మైథాలజీ కలిపిన ఈ కథ కోసం అట్లీ ఎంత అంబీషస్‌గా ఆలోచించాడో ఇక్కడే క్లియర్ అవుతోంది.
ఇంటర్నేషనల్ టీమ్ మొత్తం ముంబైలో యాక్టివ్‌గా పని చేస్తోంది. కానీ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ మాత్రం ఏ సమాచారం బయటకు రానివ్వడం లేదు. తన కొత్త సినిమా కన్యాకుమారి ప్రమోషన్స్‌లో మాట్లాడినప్పుడు, “సన్ పిక్చర్స్ కఠినమైన NDA (non-disclosure agreement) పెట్టింది. ప్రొడక్షన్ పూర్తయ్యే వరకు ఎలాంటి డీటెయిల్స్ బయటకు చెప్పలేం” అని క్లియర్‌గా చెప్పేశారు.
అయితే ఇటీవల జరిగిన సినీ వర్కర్స్ సమ్మె ఈ సినిమా షూట్‌కి కూడా చిన్న గ్యాప్‌నే ఇచ్చిందట.
“హాలీవుడ్ టెక్నీషియన్స్ ఇప్పటికే సెట్‌లో ఉన్నారు. వాళ్ల టైమ్ వేస్ట్ కాకుండా ఉండేందుకు ఫెడరేషన్ నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకొని షూట్ కంటిన్యూ చేశాం” అని బన్నీ వాస్ క్లారిటీ ఇచ్చాడు.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ఎంటర్టైనర్‌లో అల్లు అర్జున్ హీరోగా దీపికా పడుకోన్ ఫీమేల్ లీడ్‌గా నటిస్తోంది.
ప్రేక్షకులలో ఈ సినిమాపై గ్లోబల్ లెవెల్‌లో హైప్ క్రియేట్ చేయడానికి నిర్మాతలు భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా, హాలీవుడ్ ప్రముఖ మార్కెటింగ్ ఏజెన్సీ కనెక్ట్ మాబ్ సీన్(Connekkt Mob Scene) ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయిందట.
ఈ ఏజెన్సీకి చెందిన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ క్రియేటివ్ కంటెంట్ అలెగ్జాండ్రా ఈ. విస్కోంటి తొలిసారి ఇండియాకు వచ్చారు. గ్లోబల్ స్టాండర్డ్స్‌తో ప్రమోషన్ స్ట్రాటజీని సిద్ధం చేయడం కోసం ఈ విజిట్ జరిగినట్లు సినీ వర్గాల సమాచారం.
సినిమా టీమ్ అంతర్జాతీయ మార్కెట్లో AA22కి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.