సినిమా వార్తలు

చిరు–బాలయ్యపై RGV బోల్డ్ స్టేట్‌మెంట్స్… ఇండస్ట్రీ షాక్!

వివాదాల బ్రాండ్ అంబాసడర్ రామ్ గోపాల్ వర్మ (RGV) మళ్లీ ఒకసారి సంచలన కామెంట్లతో న్యూస్‌లోకి వచ్చాడు. కొంతకాలంగా సోషల్ మీడియాలో తగ్గిన వర్మ, ఇప్పుడు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో బాలకృష్ణ–చిరంజీవిల గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇంటర్వ్యూలో చిరంజీవితో సినిమా ఎందుకు చేయరని అడిగితే వర్మ సూటిగా చెప్పేశాడు:

వర్మ చిరంజీవితో సినిమా ఎందుకు చేయడం లేదు అనే ప్రశ్నకు సమాధానం చెప్పాడు. చిరంజీవితో సినిమా చేసే కెపాసిటీ నాకు లేదు. నా సెన్సిబిలిటీలో ఆయనకున్న రేంజ్ కి, అయన మీద ఆయన అభిమానులు పెట్టుకున్న అంచనాలకు సెట్ అవ్వదు. చిరంజీవితో సినిమా చేయను అని అనను… అసలు ఆయనతో సినిమా చేయడం నాకు చేతకాదు. అందుకే నేను చేయను’ అని చెప్పుకొచ్చాడు.

ఇక నందమూరి బాలకృష్ణ గురించి మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు నేను బాలకృష్ణ సినిమాలు చూడలేదు. చూడను. ఎప్పుడో 20, 30 ఏళ్ళ క్రితం చూసాను. ఎందుకు చూడను అంటే అది నా సెన్సిబిలిటీ కాదు’ అని చెప్పుకొచ్చాడు.

ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి.
“వర్మ మళ్లీ ఆ స్థాయికి వచ్చేస్తున్నాడా?”
“స్టార్ హీరోల మీద ఇలా డైరెక్ట్‌గా మాట్లాడడం షాక్!” అంటూ నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు.

ఇక శివ రీ-రిలీజ్ తర్వాత కొత్త ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టిన వర్మ—
“ఈ సినిమాలో నేనెంత వర్మనో మరోసారి చూపిస్తా” అంటూ కాంఫిడెంట్‌గా ఉన్నాడు.

RGV నిజంగా బౌన్స్ బ్యాక్ అవుతాడా?
లేదా ఇవి మరోసారి హంగామా కోసమేనా?
నెటిజన్స్ మాత్రం ఆసక్తిగా చూస్తున్నారు!

Similar Posts