చిరంజీవి, రాజమౌళి కాంబినేషన్ ఇంట్రస్టింగే. అయితే తనకు రాజమౌళి తో చేయాలనే ఆసక్తి లేదని అంటన్నారు చిరంజీవి. ఇండియన్‌ సినిమా రూపురేఖలు మార్చేసిన రాజమౌళితో చిరంజీవి ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. గతంలో మగధీర సినిమా చేయాలనుకున్నారు కానీ కుదరలేదు. ఆ తర్వాత ఎప్పుడూ ఆ ప్లాన్‌ జరగలేదు. తాజాగా దీనిపై స్పందించారు మెగాస్టార్.

జక్కన్నతో మూవీ చేయకపోవడంపై రిగ్రెట్‌ ఉందా అనే ప్రశ్న ఎదురైన నేపథ్యంలో తనదైన స్టయిల్‌లో ఆయన స్పందించారు. “రాజమౌళి గారు సినిమాకు చాలాకాలం వెచ్చిస్తారు.

నాలుగేళ్లు, ఐదేళ్ల వరకు ఒకే ప్రాజెక్ట్‌తో ఉండటం సాధ్యపడదు. నేను ఒకేసారి మూడు నాలుగు చిత్రాల్లో నటిస్తుంటాను. రోజుకు నాలుగు గంటలు ఓ సినిమాకు కేటాయించాల్సి వస్తుంది. అలాంటి షెడ్యూల్‌కు జక్కన్న స్టైల్ సెట్ కాదు” అని పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలతో, చిరంజీవి రాజమౌళి కాంబినేషన్ చూడాలని ఆశించిన అభిమానులకు కొంత నిరాశే తప్పలేదు. అయితే చిరు చెప్పినది నిజమేనని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. రాజమౌళి ప్రతీ సినిమాను ఆరేళ్ల ప్రయాణంలా తీర్చిదిద్దుతారు. సీనియర్ నటుడిగా చిరు ఏటా రెండు సినిమాలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తుండటంతో, జక్కన్న లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్‌ పట్ల ఆసక్తి చూపించకపోవడం సహజమే.

,
You may also like
Latest Posts from