సినిమా వార్తలు

విజయ్ దేవరకొండకు ‘బొమ్మ’ చూపించిన ఐబొమ్మ! రవి ఒప్పుకున్న నిజాలు షాక్!

ఆ మధ్యన స్టార్ హీరో విజయ్ దేవరకొండ‌కు ఐబొమ్మ ఇచ్చిన వార్నింగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి గుర్తుండే ఉండి ఉంటుంది.

“మా మీద ఫోకస్ చేస్తే… మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది”

అన్న ఆ హెచ్చరిక ఎందుకు హీరోకే వచ్చిందో అప్పట్లో అందరికీ పెద్ద ప్రశ్న. ఇప్పుడు, ఐబొమ్మ రవి అరెస్టుతో ఆ మిస్టరీ పూర్తిగా బయటపడింది.

‘కింగ్‌డమ్’ రిలీజ్ మొదటి రోజే పైరసీ బారిన!

విజయ్ దేవరకొండ నటించిన కింగ్‌డమ్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే HD ప్రింట్ నెట్టింట వైరల్ అయ్యింది. అంతేకాకుండా సినిమా లీక్ చేసాక నిర్మాతలు లేదా డిస్ట్రిబ్యూటర్లకు కాకుండా… నేరుగా హీరోకే ఐబొమ్మ టీమ్ వార్నింగ్ ఇవ్వడం అందరిని షాక్‌కు గురి చేసింది.

“హీరోకి ఎందుకు వార్నింగ్?”
అనేది అప్పటి బర్నింగ్ డిస్కషన్.

ఇప్పుడు పోలీసుల ముందు రవి చెప్పిన అసలు మాటలు

ఇటీవల ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవిని పోలీసులు అరెస్టు చేసి కస్టడీకి తీసుకున్నారు. కస్టడీలో రవి తన వాంగ్మూలంలో—
విజయ్ దేవరకొండకు ఇచ్చిన వార్నింగ్‌ను పోలీసుల ఎదుట పూర్తిగా బయటపెట్టాడు.

పోలీసులు వెల్లడించిన రవి మాటలు ఇలా ఉన్నాయి:

“మా మీద ఫోకస్ చేస్తే… మేం మీ మీద ఫోకస్ చేస్తాం అనీ మా టీమ్ ముందే చెప్పింది. మీరు వినలేదు. ఏజెన్సీలకు డబ్బులు ఇచ్చి మమ్మల్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. మీ ‘కింగ్‌డమ్’ సినిమాను బైటకు తీయాల్సి వస్తుంది అనీ హెచ్చరించాం.”

ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో మళ్లీ పెద్ద చర్చ మొదలైంది.

ఇది ఎందుకు జరిగింది? పోలీసుల వివరణ

విజయ్ దేవరకొండ గతంలో చేసిన ‘ఖుషీ’ సినిమానే అసలు కారణమట. ఆ సినిమా థియేటర్‌లో మొదటి షో పడిన కొద్ది నిమిషాలకే
ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో పైరసీని అదుపులో పెట్టేందుకు విజయ్ చర్యలు తీసుకున్నారు. అదే విషయం ఐబొమ్మ టీమ్‌ను రెచ్చగొట్టిందని రవి పోలీసుల ముందే అంగీకరించాడు.

ఐబొమ్మ వార్నింగ్ అసలేనా నకిలీనా?

ఆ సమయంలో ఇది నిజంగా ఐబొమ్మ అధికారిక ప్రకటనేనా? లేక నకిలీ సైట్ చేసిన డ్రామానా? అని ఫ్యాన్స్, నెటిజన్స్‌లో పెద్ద డిబేట్ నడిచింది. ఇప్పుడు ఆ సందేహాలన్నింటికీ ఫుల్ స్టాప్. రవి స్వయంగా “వార్నింగ్ మేమే ఇచ్చాం” అని ఒప్పుకోవడంతో మాటర్ క్లియర్ అయ్యింది.

మొత్తానికి:

ఒక పైరసీ వెబ్‌సైట్… స్టార్ హీరోకే “బొమ్మ” చూపించిన అరుదైన ఘటన— ఇప్పుడే పూర్తిగా వెలుగులోకి వచ్చింది!

Similar Posts