సింగపూర్ లో చికిత్స అనంతరం కుమారుడిని తీసుకొని హైదరాబాద్ వచ్చిన పవన్ ను సోమవారం సాయంత్రం అల్లు అర్జున్ కలిశారు. స్వయంగా ఇంటికి వెళ్లి పవన్ ని కలిసిన బన్నీ.. మార్క్ శంకర్ యోగక్షేమాలు అడిగి, దాదాపు గంటసేపు అక్కడే ఉన్నారు. ఈ విషయం గురించి మొదట మీడియాకి కూడా సమాచారం లేదు. మెగా, అల్లు సన్నిహిత వర్గాల ద్వారా కాస్త ఆలస్యంగా ఈ విషయం బయటకు వచ్చింది.

ఈ ఘటనతో.. ఎన్ని వచ్చినా, ఏం జరిగినా.. మెగా-అల్లు కుటుంబాల మధ్య అనుబంధం ఎప్పటికీ ఇలాగే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో అనవసరమైన విమర్శలు చేస్తున్న కొందరు అభిమానులు ఈ విషయాన్ని గ్రహిస్తే మంచిదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ అక్కడ చికిత్స అనంతరం కోలుకున్నాడు. కుమారుడిని చూసేందుకు కుటుంబంతో కలిసి వెళ్లిన పవన్.. మార్క్ శంకర్‌తో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు.

,
You may also like
Latest Posts from