అనుష్క శెట్టి తాజాగా ఒక మీడియా ఇంటరాక్షన్ లో ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. విస్తారంగా ట్రావెల్ చేస్తూ, తన సమయం చాలా భాగాన్ని పుస్తకాలకు కేటాయిస్తానని చెప్పారు. ప్రస్తుతం ఆమె చదువుతున్న గ్రంథం ‘మహాభారతం’ అని స్వయంగా వెల్లడించారు.
ఇప్పుడు ఇక్కడ ఒక కొత్త క్యూరియాసిటీ మొదలైంది. రాజమౌళి ఇప్పటికే తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా మహాభారతం చేయబోతున్నారని ప్రకటించిన విషయం. మరి అనుష్క ఇప్పుడు ప్రత్యేకంగా మహాభారతం చదవటం… ఆ ప్రాజెక్ట్ వైపు దృష్టి సారించడమేనా? ఏదైనా పాత్ర కోసం ముందే ప్రిపేర్ అవుతున్నారా? అన్న అనుమానం అభిమానుల్లో రేకెత్తుతోంది.
ఒక ప్రశ్నకు సమాధానంగా, “నాకు పూర్తిగా నెగటివ్ క్యారెక్టర్ చేయాలన్న కోరిక ఉంది. అలాంటి స్ట్రాంగ్ రోల్ వస్తే తప్పకుండా చేస్తాను” అని చెప్పడం మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. మహాభారతంలో కూడా శక్తివంతమైన, నెగటివ్ షేడ్స్ గల పాత్రలు ఎన్నో ఉన్నాయి. ఇంతకీ అనుష్క చేద్దామనుకునే నెగిటివ్ పాత్ర ఏమిటి, చాలా మంది ద్రౌపతి పాత్ర అనుష్క చేసే అవకాసం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇంతకీ “అనుష్క మహాభారతం చదవటం యాదృచ్ఛికమా…? లేక రాజమౌళి ప్రాజెక్ట్ కోసం ప్రిపరేషన్ ప్రారంభమైందా…?”
ఇక ఆమె తాజా సినిమా ‘ఘాటి’ లోనూ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతోంది. కాబట్టి ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు సబ్‌స్టెన్స్ కూడా ఇవ్వబోతున్నానని అనుష్క వాగ్దానం చేస్తున్నారు.