సందీప్ రెడ్డి వంగా వర్క్ క్లాస్ గా ఉంటుంది, మాస్ ని రీచ్ అవుతుంది. కానీ స్పీడ్ ఉండదు అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాల మధ్య కూడా చాల గ్యాప్ ఉంది. ఇప్పుడు అదే పద్ధతిని ‘స్పిరిట్’కీ కొనసాగిస్తున్నాడేమో అన్న టాక్ వస్తోంది. ఎప్పుడో ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యింది… కానీ సెట్స్ మీదకి మాత్రం రావడమే లేదు!

ఇక ప్రభాస్ విషయానికి వస్తే — ఓ పాన్ ఇండియా స్టార్, ఏ ఒక్క సినిమా విడుదలకైనా కోట్ల మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న పరిస్థితిలో, ఇలా ఏడాది తరబడి ఎదురుచూస్తూ ఊరుకోగలడా? ఇదే ప్రశ్న.

ప్రస్తుతం ప్రభాస్ ‘ది రాజా సాహెబ్’, ‘ఫౌజీ’ షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ, ‘స్పిరిట్’ లాంటి సినిమాకి జస్ట్ టైం పెడతాడా లేక ఫోకస్ మార్చేస్తాడా అన్నదీ చర్చానీయాంశమే.

తెలుగు సినీ అభిమానుల్ని ఉర్రూతలూగిస్తూ ఎదురుచూసేలా చేస్తున్న ప్రాజెక్ట్‌ — ‘స్పిరిట్’. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ లాంటి సంచలన చిత్రాల తర్వాత సందీప్ రెడ్డి వంగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో కలసి సినిమా చేయబోతున్నాడన్న వార్తే హైప్‌ను క్రియేట్ చేసింది. కానీ… ఊహించని విధంగా ఈ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది.

మొదటిది ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందనుకున్నారు, ఆపై వేసవికి షిఫ్ట్ అయింది. తాజాగా వంగా మాట్లాడుతూ సెప్టెంబరులో షూటింగ్ స్టార్ట్ అవుతుందన్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం, ఇప్పుడు ఈ సినిమా ఈ ఏడాది చివర్లో కానీ, లేదా నేరుగా 2026 ప్రారంభంలో కానీ మొదలయ్యేలా ఉందట!

వాస్తవానికి, వంగా ఈ సినిమాకు గట్టి స్క్రిప్ట్ రెడీ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకున్నాడని, అదే సమయంలో ప్రభాస్ ‘ది రాజా సాహెబ్’, ‘ఫౌజీ’ వంటి కమిట్‌మెంట్‌లతో బిజీగా ఉన్నాడని టాలీవుడ్ వర్గాల్లో చర్చ.

సందీప్ వంగా స్టైల్‌కి, ప్రభాస్ మాస్‌ ఇమేజ్‌కి ఇది బెస్ట్ కాంబినేషన్ అని భావించిన అభిమానులకు ఈ వాయిదాలు మాత్రం అసహనంగా మారుతున్నాయి. ‘స్పిరిట్’ ఎప్పటికి సెట్స్ మీదకు వెళ్తుందో చూడాలి మరి!

, , ,
You may also like
Latest Posts from