సినిమా వార్తలుసోషల్ మీడియా

మరోసారి దీపికా పదుకొనే ట్రోలింగ్! ఈ సారి భర్త సినిమా కారణం?

సందీప్ రెడ్డి వంగా తీస్తున్న “స్పిరిట్”, నాగ్ అశ్విన్–ప్రభాస్ కలిసి చేస్తున్న “కల్కి 2” వంటి భారీ ప్రాజెక్టుల నుంచి దీపికా పదుకొనే తప్పుకోవడానికి కారణం — ఆమె పెట్టిన కఠిన షరతులేనని తెలిసిందే. రోజుకు 8 గంటలకంటే ఎక్కువ పని చేయను అని స్పష్టంగా చెప్పడంతో, మేకర్స్ ఇతర ఆప్షన్ల వైపు వెళ్లిపోయారని ఇండస్ట్రీ బజ్.

సెట్‌పై ఫిక్స్‌డ్ అవర్స్ కావాలని దీపికా పదుకొనే ఓపెన్‌గా చెప్పింది. పెద్ద షెడ్యూల్స్, కంటిన్యూ గా రాత్రిళ్లు వర్క్ చేయాలని డిమాండ్ చేసే సినిమాలను ఆమె ఇటీవల రిజెక్ట్ చేస్తోంది. ఇండస్ట్రీ కూడా అర్దం చేసుకుని ముందుకు వెళ్తోంది. ఇక‌ వివాదం ముగిసిందనుకున్న సమయంలో, మరోసారి ఈ విషయం చర్చల్లోకి వచ్చింది.

ఈ డిబేట్ మళ్లీ హీట్ అయింది. కారణం—దీపికా భర్త రణవీర్ సింగ్ నటించిన “ధురంధర్” ట్రైలర్ లాంచ్‌లో డైరెక్టర్ ఆదిత్య ధర్ చేసిన కామెంట్.

“మా టీమ్‌లో అందరూ 16–18 గంటలు నాన్‌స్టాప్‌గా పని చేశారు. ఎవ్వరూ కంప్లైంట్ చేయలేదు. అందరి డెడికేషన్‌తోనే ఈ స్థాయి అవుట్‌పుట్ వచ్చిందని” ఆదిత్య ధర్ చెప్పడంతో… సోషల్ మీడియాలో ఒక్కసారిగా హీట్ పెరిగింది.

“రణవీర్‌కు ఇంత లాంగ్ అవర్స్ సమస్య లేదు… అయితే దీపికా పదుకొనే ఎందుకు?” అంటూ నెట్టింట్లో ఆమెను ట్రోల్ చేస్తున్న కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

అదే సమయంలో దీపికా తాజాగా మరోసారి ఈ అంశంపై స్పందించారు. తాజా ఇంటర్వ్యూలో దీపికా మాట్లాడుతూ..ఇప్పుడు నేనొక బిడ్డకుతల్లిని. తల్లయ్యాక మా అమ్మగారిపై గౌరవం మరింత పెరిగింది. పర్సనల్‌ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేయడం ఎంత కష్టమో ఇప్పుడు అర్థమైంది.

కొత్తగా బిడ్డకు జన్మనిచ్చి తిరిగి పనిలోకి వచ్చే మహిళలకు ఇండస్ట్రీ మరింత సపోర్టివ్‌గా ఉండాలి,” అని భావోద్వేగంగా చెప్పింది.అలాగే ఆమె 8 గంటల పని విధానం గురించి మరోసారి స్పష్టమైన వివరణ ఇచ్చింది. రోజుకు 8 గంటలు పని చేయడం శరీరానికి, మనసుకు హెల్తీ. ఒత్తిడిలో పనిచేస్తే అవుట్‌పుట్ మంచిగా రాదు. మా ఆఫీసు కూడా ఇదే రూల్‌ను ఫాలో అవుతుంది. టైమ్ చాలా విలువైనది. దాన్ని ఎవరితో, ఎలా ఖర్చు చేయాలో నిర్ణయించుకోవడం నా హక్కు. నిజమైన సక్సెస్ అంటే అదే. 8 గంటలే పని చేయాలన్న నా నిర్ణయం ఇప్పటికీ సరైనదే,” అని స్పష్టం చేసింది.

Similar Posts