ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోన్న SSMB 29 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తైనట్లు సమాచారం. ఇండియాతో పాటు సౌతాఫ్రికా, యూరోప్ లోనూ ఈ మూవీ షూటింగ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు. ఈ చిత్రం గురించిన ఓ లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతోంది.
అదేమిటంటే.. ఈ చిత్ర తదుపరి షెడ్యూల్లో భాగంగా నీటిలో ఓ భారీ బోట్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్లో మహేశ్, ప్రియాంక, పృథ్వీరాజ్‌తో పాటు దాదాపు 3వేల మంది జూనియర్ ఆర్టిస్ట్‌లు పాల్గొననున్నారని.. దీనికోసం వీళ్లంతా ప్రత్యేకంగా సన్నద్ధం అవనున్నారని తెలుస్తోంది.
మే నుంచి జూన్ వరకు ఈ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నారట. దీనికోసం ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ను సిద్ధం చేస్తున్నారని.. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ నేతృత్వంలో ఈ ఫైటింగ్ సీన్ ని తెరకెక్కించనున్నారని తెలిసింది.
అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న ఈ సినిమా ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహసికుడి కథగా ఉండనుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథ, దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు.