

ఒకప్పుడు టాలీవుడ్‌కి శ్రీనువైట్ల అంటేనే హ్యాట్రిక్ హిట్స్ గుర్తుకొచ్చేవి. వెంకీ, ఢీ, దూబాయ్ శీను, దూకుడు, బాద్‌షా సినిమాలతో వరుస బ్లాక్‌బస్టర్స్ కొట్టి ఓ వెలుగు వెలిగాడు. “కామెడీ, యాక్షన్ కాంబినేషన్‌లో హిట్ ఫార్ములా అంటే శ్రీనువైట్లే” అని చెప్పుకునే రోజులు. కానీ ఆగడు నుంచి ఆగిపోయిన హిట్ మళ్లీ దొరకలేదు. ఆ తర్వాత వచ్చిన *బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోని, విశ్వం … అన్నీ డిజాస్టర్స్.
అదే స్థితి హీరో నితిన్‌ది కూడా. జయం, సై తర్వాత వరుస ఫ్లాపుల నుంచి ఇష్క్ తో బలమైన కంబ్యాక్ ఇచ్చాడు. భీష్మ తో కెరీర్ మళ్లీ పీక్‌లోకి వెళ్లినట్టే అనిపించింది. కానీ ఆ తర్వాత చేసిన మాచర్ల నియోజకవర్గం, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్‌హుడ్, తమ్ముడు అన్నీ డిజాస్టర్స్‌గానే నిలిచిపోయాయి.
ఈ నేపధ్యంలోనే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తంలో షాక్ ఇస్తున్న టాక్ ఏంటంటే — “నితిన్ – శ్రీనువైట్ల కాంబినేషన్‌లో మైత్రీ మూవీస్ ఓ సినిమా ప్లాన్ చేస్తోంది”
సోషల్ మీడియాలో డిస్కషన్ ఓ రేంజ్‌లో సాగుతోంది:
“ఫ్లాప్ హీరో + ఫ్లాప్ డైరెక్టర్ = ప్లస్ అవుతుందా? లేక మళ్లీ డిజాస్టర్ అవుతుందా?” అంటూ సెటైర్లు వినపడుతున్నాయి.
అయినా… ఈ కాంబినేషన్ గురించి వస్తున్న బజ్ మాత్రం మినిమమ్ లెవెల్‌లో లేదు.
మొదట నితిన్ విక్రమ్ కుమార్ తో సినిమా చేయబోతున్నాడని టాక్ వచ్చింది. ఇష్క్ డైరెక్టర్‌తో మళ్లీ హిట్ ఖాయం అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో గ్యాప్‌లో శ్రీనువైట్ల వైపు మలుపు తిరిగాడు నితిన్.
కామెడీ – యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కబోయే ఈ సినిమా, శ్రీనువైట్ల గోల్డెన్ డేస్ హిట్స్ స్టైల్లో ఉండబోతోందని అంటున్నారు. రచయిత నందు కథ అందించాడని టాక్. కథ విన్న తర్వాత “ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది” అనే నమ్మకంతోనే నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
ఈ ప్రాజెక్ట్ నిజమైతే… ఇది నిజంగా నితిన్ – శ్రీనువైట్ల ఇద్దరికీ పెద్ద కంబ్యాక్ అవుతుందా?
లేకపోతే మళ్లీ వరుస ఫ్లాపుల లిస్ట్‌లో చేరిపోతుందా?
త్వరలోనే అధికారిక అనౌన్స్‌మెంట్ రావొచ్చని బజ్. అప్పటి వరకు ఇండస్ట్రీ మొత్తం ఒక్క ప్రశ్నే:
“నితిన్ – శ్రీనువైట్ల: రిస్క్ కాంబోనా? లేక బ్లాక్‌బస్టర్ కాంబోనా?”