ప్రమోషన్స్ కోసం సినిమా వాళ్లు రకరకాల విన్యాసాలు చేస్తూంటారు. దాంతో ఏది నిజం ,ఏది అబద్దం అనేది తేల్చుకోలేని డైలమోలో పడిపోతూంటారు అభిమానులు. ఇటీవలే విడుదలైన జాట్ సినిమాకు అధికారికంగా సీక్వెల్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఈ సినిమా అక్కడేమీ రికార్డ్ లు బ్రద్దలు కొట్టడం లేదు. ఓ మాదిరిగా నడుస్తోంది. మరి అలాంటప్పుడు ఎందుకు సీక్వెల్ ప్రకటన ఇచ్చారనేది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
నెంబర్స్ ఎప్పుడూ అబద్ధం చెప్పవు. 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన జాట్ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 75 కోట్లు మాత్రమే వసూలు చేసింది. సన్నీ డియోల్ ఒక్కడే 50 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకున్నాడు, థియేట్రికల్ షేర్ కూడా దానిని కవర్ చేయదు.
ఓవర్సీస్‌లో ఈ సినిమా ఇప్పటికే వాష్‌అవుట్ అయింది. జాట్ నష్టాల బాటలో పయనిస్తోంది. అలాంటప్పుడు ఇప్పుడు రెండో భాగం గురించి ఎందుకు చర్చ జరుగుతోంది? ఈ సీక్వెల్ టాక్ నిజమైన సృజనాత్మక నిర్ణయం కంటే చివరి నిమిషంలో మార్కెటింగ్ జిమ్మిక్‌గా అనిపిస్తుందని తేల్చేస్తున్నారు.
అయితే ఈ సినిమాకి సీక్వెల్ గా జాట్ 2 కూడా ఉంటుంది అని తాజాగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దీనితో ఈ సాలిడ్ అనౌన్సమెంట్ పట్ల అభిమానులు ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు.
సన్నీ డియోల్ నుంచి సీక్వెల్ అంటే దానికి భారీ మార్కెట్ ఉంది. ఆయనకు సీక్వెల్స్ అచ్చొచ్చాయి. దాంతో జాట్ ఇంకొంచెం గట్టి ప్రమోషన్స్ చేసి ఉంటే ఇంకా పెద్ద సక్సెస్ ని అందుకొని ఉండేది కానీ ఇపుడు సీక్వెల్ అనౌన్స్ చేయడంతో దీనికి మాత్రం గట్టి రెస్పాన్స్ ఉండొచ్చని చెప్పాలి.