సినిమా వార్తలు

‘జటాధర’ తో షాక్ ఇచ్చిన సుధీర్ బాబు – ఇంత చెత్తగా కూడా సినిమా తీస్తారా?

సుధీర్ బాబు కొత్త సినిమా ‘జటాధర’ చూసిన వాళ్లంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఈ మధ్యకాలంలో ఇంత దారుణమైన మేకింగ్, ఇంత క్లూలెస్ స్క్రీన్‌ప్లేతో వచ్చిన సినిమా లేదనేలా ఫీలవుతున్నారు చూసినవాళ్లు. కథా రాత, నటన, టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ — ఏ ఒక్కటిలోనూ సినిమా లెవెల్ కనబడలేదనే కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

20 సినిమాలు చేసిన సుధీర్ బాబు ఇలా హాఫ్ బేక్డ్, డిజాస్ట్రస్ ప్రాజెక్ట్లో హీరోగా నటించడం చూసి అభిమానులు కూడా షాక్‌లోకి వెళ్లిపోయారు.

ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే — ఈ సినిమా కథను ఎవరైనా రాశారనుకుంటే పొరపాటే. సుధీర్ బాబు టీమ్ ఈ కథని రెండు సంవత్సరాలపాటు డెవలప్ చేసింది! నిర్మాత ప్రేరణ అరోరా ఒక కథ చెప్పగా, అది సుధీర్ బాబుకు నచ్చలేదు. అప్పటికే తన టీమ్ రెడీ చేసిన కథను ఆమెకు నేరుగా నరేట్ చేశాడు సుధీర్. ఆమెకూ ఆ పాయింట్ ఇంట్రస్టింగ్‌గా అనిపించి సినిమా సెట్‌పైకి వెళ్ళిపోయింది. కానీ, ఫలితం? జటాధర చూసిన తర్వాత నిర్మాతతోపాటు ప్రేక్షకులందరూ షాక్‌లోకి వెళ్లిపోయారు.

రిలీజ్‌కి ముందు సుధీర్ బాబు, “ఇది నా కెరీర్‌లో బెస్ట్ స్క్రిప్ట్” అని చెప్పాడు. కానీ సినిమా చూసినవాళ్ల మాటలో — “ఇది అతని కెరీర్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్!” అన్నట్టుంది.

VFX, నరేషన్, కంటెంట్ — అన్నీ అవుట్‌డేటెడ్. థియేటర్‌లో చూసిన ప్రేక్షకులు “ఇదేనా రెండు సంవత్సరాల హార్డ్‌వర్క్?” అని ప్రశ్నిస్తున్నారు.

సుధీర్ బాబు తన డెడికేషన్, ఫిట్‌నెస్, డిసిప్లిన్తో ఇండస్ట్రీలో పేరున్న హీరో. కానీ ఇవన్నీ సరిపోవు. సరైన కథలు ఎంచుకోకపోతే, మార్కెట్ నుంచి పూర్తిగా దూరమయ్యే ప్రమాదం ఉంది.

ఇప్పుడు అతనికి ఇదే హై టైమ్. వెంటనే మేల్కొని, తన స్ట్రెంత్ గుర్తించి, దానికి సరిపడే కథలు ఎంచుకుంటేనే తిరిగి గాడిలో పడే అవకాశం ఉంది. లేకపోతే జటాధర లాంటి సినిమాలు అతని కెరీర్‌కే కాక, ఇమేజ్‌కీ పెద్ద షాక్ అవుతాయి.

“సుధీర్ బాబు ‘జటాధర’తో జట్టు కట్టిన జట్టు… చివరికి జారిపోయింది!”

Similar Posts