తెలుగు చిత్ర పరిశ్రమ విషాదం చోటు చేసుకుంది. కబాలి సినిమా ఫేమ్ నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కేపీ చౌదరి సోమవారం సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలియచేసారు.

గోవాలోని ఓ హోటల్​ గదిలో విగత జీవిగా పడి ఉన్న ఆయనను సిబ్బంది చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అప్పుల్లో కూరుకుపోయిన కేపీ చౌదరి అనారోగ్య సమస్యలకు గురి అయ్యారని ఆ కారణంగానే ఆయన మరణించారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు.

2016లో సినిమా రంగంలోకి వచ్చిన కేపీ చౌదరి కబాలి చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఈ క్రమంలో సర్ధార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలను ఆయన డిస్ట్రిబ్యూషన్ చేశారు.

బీటెక్‌ చదివిన చౌదరి గతంలో పూణె ఏరోనాటికల్‌లో డైరెక్టర్ ఆపరేషన్స్‌గా పనిచేశారు. సినీ ప్రముఖలతో సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరికి సంబంధాలు ఉన్నాయి.

నిర్మాణంలో చాలా న‌ష్టాలు రావటంతో ఆ త‌ర‌వాత గోవా వెళ్లి అక్క‌డ ఓ ప‌బ్ పెట్టారు. అయితే అక్ర‌మంగా ప‌బ్ పెట్టార‌న్న అభియోగాల‌తో గోవా ప్ర‌భుత్వం ఆ ప‌బ్‌ని కూల్చి వేసింది.

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కే.పీ చౌదరి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు. అప్పులు ఇచ్చిన వారి నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ప్రాథమిక విచారణలో తేలింది.

,
You may also like
Latest Posts from