
విజువల్ గ్రాండియర్, సాంస్కృతిక ఆవేశం, ఆధ్యాత్మిక గాథ – ఇవన్నీ కలగలిపిన రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ ఇప్పుడు కేవలం బాక్సాఫీస్‌నే కాదు, బుక్ మై షోను కూడా షేక్ చేస్తోంది!
భారతదేశంలో బుక్ మై షోలోనే సెన్సేషన్:
ఈ చిత్రానికి ఇప్పటివరకు 1 కోటి టిక్కెట్లు విక్రయించబడ్డాయి — అంటే ఒక్క ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌లోనే 10 మిలియన్‌కి పైగా బుకింగ్స్. కన్నడ సినిమాకు ఇది ఒక మైలురాయి!
బాక్సాఫీస్ రికార్డ్:
ఇండియాలో కాంతార: చాప్టర్ 1 నికరంగా ₹386.9 కోట్ల వసూళ్లు సాధించింది. ఒక ప్రాంతీయ భాషా సినిమా ఇంతటి స్థాయిలో దూసుకెళ్లడం అరుదైన ఘనత.
బుక్ మై షో టికెట్ సేల్స్ డేటా:
ప్రీ సేల్ బుకింగ్స్: 9,16,390 టిక్కెట్లు
1వ వారం: 67.2 లక్షల టిక్కెట్లు
8వ రోజు: 5,78,260 టిక్కెట్లు
9వ రోజు: 6,18,420 టిక్కెట్లు
10వ రోజు: 8,17,800 టిక్కెట్లు
11వ రోజు: 5,93,170 టిక్కెట్లు
మొత్తం: 1,02,50,170 టిక్కెట్లు (10.25 మిలియన్) — ఇదే బుక్ మై షోలో రికార్డ్!
తీర కర్ణాటక సంస్కృతి, భక్తి, ఫోక్‌లర్‌తో మిళితమైన ఈ చిత్రం మనిషి–ప్రకృతి మధ్య ఉన్న మాయమయమైన బంధాన్ని ఆవిష్కరిస్తుంది. రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహించి నటించగా, రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య ముఖ్య పాత్రల్లో కనిపించారు.
మ్యూజిక్ మాంత్రికుడు అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు.
