తమిళ హీరో కార్తీతో పాటు ఆండ్రియా, రీమాసేన్‌ కాంబోలో తెరకెక్కిన చిత్రం ఆయిరత్తిల్‌ ఒరువన్‌ (యుగానికి ఒక్కడు). ఇప్పుడు ఈ చిత్రం మరోసారి థియేటర్‌లోకి వచ్చింది. విజువల్‌ వండర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు సెల్వరాఘవన్‌ తెరకెక్కించారు. 2010లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా సినిమా ఉండటంతో తమిళ్‌తో పాటు తెలుగులో కూడా మంచి విజయాన్ని నమోదుచేసింది. హీరో కార్తీకి ఈ సినిమాతో పాపులారటీ వచ్చింది.ఈ క్రమంలో రీరిలీజ్ వెర్షన్ మంచి హిట్ అవుతుందని భావించారు.

యుగానికి ఒక్కడు(Yuganiki Okkadu) సినిమా రీరిలీజ్‌ కానున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించటంతో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. 15 ఏళ్ల తర్వాత చోలాస్ మళ్లీ తిరిగి వస్తున్నారని వారు ఒక పోస్టర్‌ విడుదల చేశారు. ఎపిక్ ఫాంటసీ మాస్టర్ పీస్ చూసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, అమెరికాలో మార్చి 14న ఈ చిత్రం రీరిలీజ్‌ కానుందని ప్రకటించారు. అయితే, ఈ సినిమా రీరిలీజ్ లో డిజాస్టర్ అయ్యింది. జనం ఎవరూ పెద్దగా థియేటర్స్ దగ్గర కనపడలేదు.

ఇప్పటికే ఈ సినిమా తెలుగు వర్షన్‌ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుంది. తమిళ్‌ వర్షన్‌ సన్‌నెక్ట్స్‌లో అందుబాటులో ఉంది.

ఈ చిత్రనికి సీక్వెల్ వస్తుందని పదేళ్ల నుంచి ప్రచారం నడుస్తూనే ఉంది. దర్శకుడు సెల్వ కూడా పలు సందర్భాల్లో ‘ఆయిరాతిల్ ఒరువన్’ సీక్వెల్ గురించి మాట్లాడారు. ఇప్పుడు నెటిజన్ ప్రశ్నకు సమాధానం చెప్పడంతో తప్పక తీస్తాడని అంటున్నారు.

ప్రస్తుతం సెల్వ రాఘవన్.. ధనుష్ హీరోగా కొత్త చిత్రానికి సిద్దమవుతున్నారు. ఇది పూర్తవగానే ‘ఆయిరాతిల్ ఒరువన్ 2’ గురించి ప్రకటన చేసే అవకాశం ఉంది.

, , , ,
You may also like
Latest Posts from