
తమిళ సినిమాలే కాదు, పాన్ ఇండియా ఫ్యాన్స్‌ను కలిగిన స్టార్ విజయ్ ఇప్పుడు కొత్త ఇబ్బందుల్లో పడ్డారు!
తమిళ హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్’ జనవరి 9న విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు. కానీ కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన, భారీ సంఖ్యలో జనం మృతి చెందటం నేపథ్యంలో సినిమా ప్రమోషన్ అప్‌డేట్స్‌ను టీమ్ నిలిపివేసింది. ఇప్పుడు అయితే… సినిమా రిలీజ్‌పైనే అనుమానాలు మొదలయ్యాయి!
తాజా తమిళ మీడియా రిపోర్ట్స్ ప్రకారం, కరూర్ ఘటనపై కేసు లేదా వివాదం ఈ నెలలో క్లియర్ కాకపోతే, సినిమా విడుదలకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందట. ప్రస్తుతం విజయ్ పార్టీ ‘తమిళ వెట్రి కళగం (TVK)’ ఈ ఘటనతో లింక్ అవ్వడంతో, ఆయన లేదా సినిమా టీమ్ ఎటువంటి ప్రమోషన్స్ చేయలేకపోతున్నారు.
అయితే, నిర్మాతల సమీప వర్గాలు మాత్రం ఈ రూమర్స్‌ను ఖండిస్తూ —
“సినిమా జనవరి 9ననే వస్తుంది, ఎలాంటి ఆలస్యం లేదు. నవంబర్ నుంచి భారీ ప్రమోషన్ క్యాంపైన్ ప్రారంభిస్తాం,”
అని స్పష్టం చేశాయి.
‘జన నాయగన్’లో విజయ్ ఓ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు ఫస్ట్ రోర్ టీజర్ చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. ఖాకీ డ్రెస్‌లో కత్తి పట్టుకుని ఇచ్చిన ఎంట్రీ ఫ్యాన్స్‌ను షాక్‌లోకి నెట్టింది! ఇది పూర్తిగా పాలిటికల్ యాక్షన్ థ్రిల్లర్, అంటే… రాజకీయాల్లో పోలీస్ ఏం చేస్తాడో తెలుసుకోవాలంటే సినిమా విడుదలయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
దర్శకుడు హెచ్. వినోద్ విజయ్ స్టార్‌డమ్‌ను బాగా అర్థం చేసుకున్నాడని టీజర్‌నే చెబుతోంది. సంగీతం అనిరుద్ రవిచందర్, నిర్మాణం కెవిఎన్ ప్రొడక్షన్స్ – అన్నీ టాప్ క్లాస్ కాంబినేషన్లు!
తెలుగులో కూడా ఈ సినిమాను ‘జన నాయకుడు’ పేరుతో విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం తెలిపింది.
ఇక రాజకీయ వాతావరణం, కేసు పరిణామాలు ఎలా మలుపు తిరుగుతాయో చూడాలి — ఎందుకంటే తమిళనాడులో ఒక చిన్న ఇష్యూ కూడా పెద్ద కలకలం సృష్టించగలదు.
