జర్నలిస్టుగా,చిన్న మళయాళ సినిమాల్లో హీరోయిన్ గా చేసిన రినీ ఆన్ జార్జ్ చేసిన సంచలన ఆరోపణలు కేరళ రాజకీయాల్లో షాక్ క్రియేట్ చేశాయి. రినీ చెబుతున్నది ఏమిటంటే—ఒక ప్రముఖ పార్టీకి చెందిన యువ నేత తనకు అసభ్యకరమైన సందేశాలు పంపి, హోటల్‌కి రావాలని ఆహ్వానించాడట!

ఆమె ఈ విషయాన్ని పార్టీ టాప్ లీడర్ల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని, పైగా ఆ నేతకే మరిన్ని అవకాశాలు ఇచ్చారని బహిర్గతం చేశారు.

“తామే ఇలాంటి పనులు చేసేవాళ్లు ఇంక…ఇతర మహిళలను ఎలా రక్షిస్తారు? ” అంటూ రినీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాహుల్ పేరు బయటకు!

ఈ ఆరోపణలతోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే, యూత్ కాంగ్రెస్ రాష్ట్రాధ్యక్షుడు రాహుల్ మంఖూటతిల్ పేరు బయటకు రావడం సీన్‌ మరింత హాట్‌గా మార్చింది.
బీజేపీ కార్యకర్తలు ఆయన కార్యాలయం ముందు నిరసనలు చేస్తూ “తక్షణమే రాజీనామా చేయాలి” అని డిమాండ్ చేస్తున్నారు.

ఇక రచయిత హనీ భాస్కరన్ కూడా ఫేస్‌బుక్‌లో రాహుల్‌పై తన అనుభవాన్ని పంచుకున్నారు. మొదట్లో సాదాసీదా సంభాషణలతో ప్రారంభమైనా, తర్వాత రాహుల్ సందేశాలు అసభ్యకరంగా మారాయని ఆమె ఆరోపించారు. అంతేకాదు, తర్వాత తన మీద తప్పుడు ప్రచారం కూడా జరిగిందని షాకింగ్ రివీలేషన్స్ చేశారు.


ఏమవుతుంది రాహుల్ భవిష్యత్తు?

ఇప్పటికే పలువురు మహిళలు కూడా రాహుల్‌పై ఫిర్యాదులు చేశారని, అయినా పార్టీ చర్యలు తీసుకోలేదని ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ బాగా ఇబ్బందుల్లో పడింది.
ఒక నటి–జర్నలిస్టు చేసిన ఈ హోటల్ ఆహ్వానం ఆరోపణ ఇప్పుడు కేరళ రాజకీయాలను కుదిపేస్తోంది.

, ,
You may also like
Latest Posts from