విజయ్ దేవరకొండ కెరీర్ సక్సెస్ టేస్ట్ మరచిపోయినట్టే ఉంది. ఎన్నో ఆశలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘కింగ్‌డమ్’ సినిమా… మొదటి రోజు దుమ్మురేపినా, వీకెండ్ పూర్తయ్యే సరికి ఊహించని విధంగా వెనక్కి వెళ్లిపోయింది.

2018లో వచ్చిన ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ల తర్వాత విజయ్‌కు మళ్లీ అలాంటి హిట్ దక్కలేదన్న సంగతి తెలిసిందే. ప్రతి సినిమాతోనూ ఆయన రీ ఎంట్రీ కోసం పోరాడుతున్నాడు. అదే క్రమంలో గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో రూపొందిన ‘కింగ్‌డమ్’ పై మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి. తొలి రోజు కలెక్షన్లతో ఆ అంచనాలు నిజమవుతాయని అనిపించిందిగానీ, తర్వాతి రోజుల్లోని ఫలితం మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది.

వాస్తవానికి సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ అదే సమయంలో విడుదలైన మహావతార్ నరసింహ సినిమాకు మాస్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ రావడంతో ‘కింగ్‌డమ్’ ఫోకస్ తప్పింది. వీకెండ్ కలెక్షన్లు తక్కువగా నమోదయ్యాయి. బయ్యర్లకు కేవలం 2/3 వసూలే జరగడంతో, విజయం దూరమే అయింది.

సోమవారం నుంచి కలెక్షన్లు మరింతగా పడిపోయాయి. ఈ పరిస్థితుల్లో సినిమా బిలో అవరేజ్ – అవరేజ్ స్టేటస్‌ నుంచే బయటపడే అవకాశం కనిపించడం లేదు.

‘కింగ్‌డమ్’ బిల్డ్ అవటం కూడా కలల సామ్రాజ్యమే అయిపోయింది!

, , , , ,
You may also like
Latest Posts from