విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన “కింగ్డమ్” … థియేటర్స్‌లో ఫలితం ఏం వచ్చిందో అందరికీ తెలిసిందే. నిర్మాత నాగవంశీ హైప్ క్రియేట్ చేసినా, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాన్ఫిడెన్స్‌ చూపించినా—ఏదీ ఆ సినిమా బాక్సాఫీస్ ట్రాక్‌ని మార్చలేకపోయింది. ఫలితం? రౌడీ బాయ్స్ కంగారు, సోషల్ మీడియాలో నెగటివ్ ట్రోల్ వేవ్.

ఇక ఇప్పుడు కేవలం నాలుగు వారాల గ్యాప్‌లోనే నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. కానీ ఇక్కడ కూడా ఫ్యాన్స్‌కి నిరాశే.

  • హృదయం లోపల సాంగ్ మిస్సింగ్.
  • ఎలాంటి అదనపు సీన్లు లేవు.
  • కొన్ని డివైజెస్‌లో ఆడియో గ్లిచ్ సమస్య.

నెట్‌ఫ్లిక్స్ టీమ్ ఫిక్స్ చేయడానికి ప్రయత్నిస్తుందన్న మాట ఉన్నా… ఈ చిన్న చిన్న ఇష్యూలతోనే క్రేజ్ మరింత కూలిపోయింది.

ఇన్‌సైడ్ టాక్ ప్రకారం ఓటిటి వర్షన్‌కి కొన్ని ఎక్స్‌ట్రా సీన్లు యాడ్ చేసే ప్లాన్ వేసారట. కానీ అలా చేస్తే సినిమా దాదాపు గంటపాటు ఎగస్ట్రా పెరిగిపోతుంది, ఆ లెంగ్త్‌తో వ్యూవర్‌షిప్ మరింత పడిపోతుందనే కారణంతో నెట్‌ఫ్లిక్స్ నో చెప్పిందట.

అసలు ఈ మధ్య ఫ్లాప్ మూవీస్‌కి ఓటిటి ప్లాట్‌ఫామ్‌లలో కూడా వ్యూస్ అంతగా రావట్లేదనే విషయం గుర్తు చేసారట.

ప్రమోషన్ టైంలో టీమ్ చాలా నమ్మకంగా ” కింగ్డమ్ 2 ” గురించి మాట్లాడినా… ఇప్పుడు ఆ మాటలన్నీ గాలిలో కలిసిపోయాయి. టాక్ ప్రకారం బాక్సాఫీస్ ఫలితం బాగా డ్యామేజ్ చేయడంతో సీక్వెల్ ప్లాన్‌ని డ్రాప్ చేశారని ఫిలిం సర్కిల్స్ చెబుతున్నాయి. ఇంకా అధికారిక క్లారిటీ రాలేదు కానీ, త్వరలోనే ఒక ఇంటర్వ్యూలో దానికి సంబంధించిన నిజం బయటపడే అవకాశం ఉంది.

ప్రస్తుతం విజయ్.. రాహుల్ సంకృత్యాన్, రవికిరణ్ కోలా డైరెక్షన్‌లో సినిమాలు చేస్తూ ఫ్యూచర్‌పై ఫోకస్ పెట్టేశాడు. కానీ “కింగ్డమ్” అనుభవం మాత్రం ఓటిటి వరకూ వెంబడిస్తూనే ఉంది.

, , , , , , ,
You may also like
Latest Posts from