
గుంటూరు కారం నుంచి వచ్చిన మాస్ సాంగ్ “కుర్చి మదతపెట్టీ” యూట్యూబ్‌లో రికార్డులు కొట్టేస్తోంది. 2024 జనవరిలో రిలీజ్ అయిన ఈ సాంగ్ అప్పటినుంచే ఫుల్ జోష్ క్రియేట్ చేసింది. ఇప్పుడు తాజాగా 700 మిలియన్ల వ్యూస్‌ను దాటేసి మరో హిస్టారిక్ మైలురాయిని చేరుకుంది.
సూపర్ స్టార్ మహేశ్‌బాబును ఊర మాస్ లుక్కులో చూడాలన్న అభిమానుల ఆశ గుంటూరు కారంతో నెరవేరింది. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్లు మాత్రం బాగానే వచ్చాయి. మహేశ్ యాక్టింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు.
శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఫుల్ ఎనర్జీతో సాంగ్ ఏదైనా ఉందా? అంటే అది కుర్చీ మడతపెట్టి పాటే..
ఆ మధ్య ఈ పాట లిరికల్ వీడియో రిలీజ్ చేయగా.. అందులో అక్కడక్కడా వచ్చే మహేశ్ స్టెప్పులు చూసి మురిసిపోయారు ఫ్యాన్స్. మహేష్ బాబు – శ్రీలీలల ఎనర్జిటిక్ డాన్స్ నంబర్‌గా వచ్చిన ఈ పాట, మూడవ తెలుగు పాటగా 700 మిలియన్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
𝟳𝟬𝟬 𝐌𝐈𝐋𝐋𝐈𝐎𝐍 views for #KurchiMadathapetti video song 🔥#GunturKaaram @urstrulyMahesh
— TWTM™ (@TWTM__) October 2, 2025
pic.twitter.com/sYY2qFjMPd
ప్రస్తుతం టాప్‌లో ఉన్నవి:
బుట్టబొమ్మ – 922M వ్యూస్
రాములో రాములా – 750M వ్యూస్
కుర్చి మదతపెట్టీ ఈ స్పీడ్‌తో రాములో రాములాను ఓవర్‌టేక్ చేసి, టాప్ 2లోకి దూసుకెళ్లే ఛాన్సులు పక్కాగా కనిపిస్తున్నాయి.
ఫ్యాన్స్ మాటల్లో – హీరో-హీరోయిన్‌ల మాస్ ఎనర్జీ ఈ పాటకు బూస్ట్ ఇచ్చిందని, రిపీట్ మోడ్‌లో వింటూనే ఉన్నారని చెబుతున్నారు.
