కొద్దిరోజుల క్రితం హీరో సూర్య నటించిన ‘రెట్రో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేజిపై మాట్లాడుతూ.. పలు విషయాలను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆదివాసీయులను అవమానించారంటూ లాయర్ కిషన్ లాల్ చౌహాన్ పోలీసులను ఆశ్రయించాడు.
విజయ్‌పై ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఆర్ నగర్ పోలీసులు కంప్లైంట్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అసలేం జరిగింది. విజయ్ దేవరకొండ ఏమన్నారు.
కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘రెట్రో’ (Retro) ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన విజయ్ దేవరకొండ పహల్గాం ఉగ్ర దాడిని ఖండిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు.
‘పాకిస్తాన్ మీద ఇండియా ఎటాక్ చేయాల్సిన పనే లేదు. అక్కడి ప్రజలకు విరక్తి వచ్చి వాళ్ల ప్రభుత్వం మీద ఎటాక్ చేస్తారు. కరెంట్, నీళ్లు లేకుండా ఆ దేశంలో పరిస్థితులు ఇదే విధంగా కంటిన్యూ అయితే! 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు బుద్ధి లేకుండా పని లేకుండా కొట్లాడుతున్నారు. మనమంతా సమష్టిగా కలిసి ఉండాలి’ అని అన్నారు.
ఈ కామెంట్స్‌పై ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. గిరిజనులను అవమానపరుస్తూ మాట్లాడారంటూ.. విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని లాయర్ కిషన్ లాల్ చౌహాన్ ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కామెంట్స్ ఆదివాసీల సంస్కృతి, జీవన విధానాన్ని అవమానకరంగా చిత్రీకరించాయని అన్నారు. ఈ కంప్లైంట్‌ను విచారణకు స్వీకరించిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈవెంట్‌కు సంబంధించి వీడియో ఫుటేజీ, సాక్ష్యాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇప్పటివరకూ విజయ్ దేవరకొండ టీం నుంచి ఎలాంటి స్పందన లేదు.