సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ సినిమా కూలీ. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో అక్కినేని నాగార్జున, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, రెబా మోనికా జాన్, సత్యరాజ్, రచితా రామ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. పూజా హెగ్డే కూడా మోనికా పాటతో ఆడియెన్స్ ను ఉర్రూతలూగించింది.
సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్ట్ 14న విడుదలైన కూలీ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడీ చిత్రం ఓటిటి రిలీజ్ కు రెడీ అవుతోంది.
“కూలీ” (దర్శకుడు లోకేష్ కనగరాజ్) త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. ఆగస్ట్ 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, కేవలం నాలుగు వారాల్లోనే డిజిటల్‌కి వస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.
500 కోట్లు వసూలు చేసినా… మిక్స్‌డ్ టాక్!
ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూలు చేసినప్పటికీ, ఈ చిత్రం ‘సూపర్ హిట్’ కాదన్న అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తోంది. తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు వచ్చాయి. ఇంకా విమర్శకులు కూడా “లోకేష్ కనగరాజ్ కెరీర్‌లో వీక్ మూవీ ఇదే” అని తేల్చేశారు. అయితే రజనీ క్రేజ్ వలనే కలెక్షన్లు గట్టెక్కాయని చెప్పాలి.
OTTలో రివర్స్ హిట్ అవుతుందా?
థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ వచ్చినా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో ఈ సినిమా కొత్త ఊపుని తెచ్చుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి. ప్రైమ్ వీడియో ఇప్పటికే హక్కులు సొంతం చేసుకుంది. సెప్టెంబర్ రెండో వారంలోనే సినిమా స్ట్రీమింగ్‌కు వస్తుందన్న బజ్ జోరుగా ఉంది.