సినీప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ సినిమా ‘SSMB29’ (వర్కింగ్‌ టైటిల్‌)షూటింగ్ మొదలై జరుగుతున్న సంగతి తెలిసింది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా పై రోజుకో వార్త వచ్చి,ప్రాజెక్టు క్రేజ్ ని ఆకాశాన్ని తాకేలా చేస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్’తో గ్లోబల్ లెవెల్‌లో తన శక్తిని చాటుకున్న రాజమౌళి, ఈ సారి మహేష్‌తో కలసి చేస్తున్న “GlobeTrotter” (వర్కింగ్ టైటిల్) పై దేశ విదేశాల ప్రేక్షకుల దృష్టి సారించే దిసగా వార్తలు వస్తున్నాయి.

దాంతో ఈ సినిమాపై అభిమానులు మాత్రమే కాదు, ఇండస్ట్రీ వర్గాల్లోనూ అంచనాలు ఎప్పటికీ లేనంతగా పెరిగాయి. అంచనాలకు తగిన స్థాయిలో విడుదల చేసేందుకు రాజమౌళి ప్లాన్‌ చేశారు. కెన్యాలో షూటింగ్‌ చేస్తున్న సందర్భంగా.. ఆ దేశ మంత్రి ముసాలియా ముదావాదిని మూవీ టీమ్‌ మర్యాదపూర్వకంగా కలిసింది. భేటీ అనంతరం ముఖ్యాంశాలను సోషల్‌ మీడియాలో అక్కడి మంత్రి పోస్టు చేశారు.

‘‘రెండు దశాబ్దాలుగా రాజమౌళి సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. చాలా శక్తిమంతమైన కథనాలను, విజువల్స్‌ను, లోతైన సాంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పడంలో ఆయన ఎంతో ప్రసిద్ధి చెందారు. తూర్పు ఆఫ్రికా అంతటా పర్యటించిన అనంతరం 120 మందితో కూడిన రాజమౌళి టీమ్‌ కెన్యాను ఎంచుకుంది. మసాయి మరా మైదానాల నుంచి మొదలు సుందరమైన నైవాషా, ఐకానిక్‌ అంబోసెలి వంటి ప్రాంతాలు ఆసియాలోనే అతిపెద్ద చలనచిత్రంగా తెరకెక్కుతున్న మూవీలో భాగం కాబోతున్నాయి.

120 దేశాల్లో ఈ మూవీని విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్‌ చేస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికిపైనే చేరువయ్యే అవకాశం ఉంది. కెన్యాలో షూటింగ్‌ చేయడం ఒకమైలురాయిగా నిలిచిపోతుంది. ప్రపంచ వేదికపై మా దేశ అందాలను, ఆతిథ్యాన్ని, సుందర దృశ్యాలను చూపడంలో ఈ సినిమా శక్తిమంతంగా పనిచేయనుంది. ఎస్‌ఎస్‌ఎంబీ 29 చిత్రంతో కెన్యా తన చరిత్రను ప్రపంచంతో పంచుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయంలో గర్వంగా ఉంది’’ అని ముసాలియా ముదావాది పేర్కొన్నారు.

ఈ బిజీ షెడ్యూల్ కారణంగా మహేష్ బాబు తన కుమారుడి బర్త్‌డే, వినాయక చవితి వేడుకలు కూడా ఫ్యామిలీతో జరుపుకోలేకపోయాడు. అంటే ఈ ప్రాజెక్ట్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమవుతుంది.

GlobeTrotter ఒక భారీ స్థాయి గ్లోబ్‌స్పానింగ్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతోంది. నవంబర్‌లో స్పెషల్ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేస్తానని రాజమౌళి వాగ్దానం చేశారు. అంతేకాక, ఈ సినిమాను 2027 సమ్మర్ రిలీజ్ ‌కి సిద్ధం చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది.

, , , , ,
You may also like
Latest Posts from