హైదరాబాద్: మహేశ్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా #SSMB29 షూటింగ్ నిశ్శబ్దంగా, కానీ స్పీడ్‌గా సాగుతోంది. హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలను రాజమౌళి చిత్రీకరిస్తున్నారు. షెడ్యూల్స్ మధ్య చిన్న బ్రేక్స్ తీసుకుంటూ ముందుకు సాగుతోంది.
ఇప్పుడిప్పుడే టీం అత్యంత భారీగా ప్లాన్ చేసిన యాక్షన్ ఎపిసోడ్‌కు సన్నద్ధమవుతోంది. ఇండియన్ సినిమాల్లో ఇప్పటివరకు ఏ చిత్రంలోనూ లేని విధంగా భారీ స్థాయిలో – బడ్జెట్, విజన్, స్టంట్స్ పరంగా – ఈ సీన్ ఉండబోతోంది. ఈ సీక్వెన్స్ సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలవనుంది.
ప్రతి చిత్రంలో హీరోలను ఫిజికల్‌గా చాలెంజ్ చేసే రాజమౌళి, మాహేశ్‌ను కూడా అదే దిశగా మలుస్తున్నారు. బాహుబలిలో ప్రభాస్, RRRలో ఎన్టీఆర్, రామ్ చరణ్ చేసినట్టే… ఈ సినిమాలో మాహేశ్ కూడా డేంజరస్ యాక్షన్ సీన్‌లకు సిద్ధమవుతున్నారు. ఎక్కువగా ఆయనే స్టంట్స్ చేస్తున్నట్టు సమాచారం.
అత్యంత ప్రమాదకరమైన సన్నివేశాల్లో మాత్రం మినిమల్‌గా డూప్స్ ఉపయోగించనున్నారని తెలుస్తోంది. అంటే స్క్రీన్ మీద యాక్షన్ మెజారిటీగా మాహేశ్ బాబునే చూస్తాం అన్నమాట!
ప్రియాంక చోప్రా లీడ్ రోల్ చేస్తుండగా, కొంతమంది అంతర్జాతీయ నటులు కూడా ఈ సినిమాకు భాగమవుతున్నారు. KL నారాయణ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం ఎంఎం కీరవాణి అందిస్తున్నారు.
ఇది ఒక గ్లోబ్-ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్ కావడం విశేషం!